ఫైల్ ఫోటో
నెల్లూరు: ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో భారీ ఎత్తున నగదు, బంగారం పట్టుబడుతోంది. సరైన పత్రాలు లేకుండా తీసుకెళుతున్న డబ్బు, బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ రోజు రాష్ట్ర్లవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో పెద్ద మొత్తంలో నగదు, బంగారం దొరికింది. నెల్లూరు జిల్లా కోవూరు ఇనమడుగు చెక్‌పోస్టు వద్ద నిర్వహించిన తనిఖీల్లో 10 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై నుంచి ఒంగోలు తీసుకెళ్తుండగా వీటిని పట్టుకున్నారు.
* నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం తుప్రాన్ వద్ద పోలీసులు తనిఖీలు జరిపి రూ.2.50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
* ఆదిలాబాద్ జిల్లా రెబ్బెన మండలం గోలేటి క్రాస్‌రోడ్స్ వద్ద తనీఖీలు, కారు నుంచి రూ. 33 లక్షలు స్వాధీనం
* పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం సమిశ్రగూడెం వద్ద తనిఖీలు, కారు నుంచి రూ.4.12 లక్షలు స్వాధీనం, ఇద్దరు అరెస్ట్
* గుంటూరు జిల్లా సత్తెనపల్లి చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు, కారు నుంచి రూ.21 లక్షలు స్వాధీనం