రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు బుధవారం నగరానికి చెందిన 14 మంది ప్రయాణికుల నుంచి 4.5 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు బుధవారం నగరానికి చెందిన 14 మంది ప్రయాణికుల నుంచి 4.5 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ. 1.2 కోట్లు ఉంటుందని అధికారుల అంచనా. నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు వారి పేర్లను వెల్లడించలేదు.