శంషాబాద్ విమానశ్రయంలో గురువారం డీఆర్ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
శంషాబాద్: శంషాబాద్ విమానశ్రయంలో గురువారం డీఆర్ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా విమానశ్రయంలో ఓ వ్యక్తి నుంచి విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
కస్టమ్స్ సర్వీస్ ఏజెంట్ నుంచి సుమారు 3.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.