శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో 11కిలోల బంగారం పట్టివేత | 11 Kgs Gold Seized In Shamshabad Airport | Sakshi
Sakshi News home page

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో 11కిలోల బంగారం పట్టివేత

Published Tue, May 28 2019 8:38 PM | Last Updated on Tue, May 28 2019 8:43 PM

11 Kgs Gold Seized In Shamshabad Airport - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు చేపట్టిన డీఆర్‌ఐ అధికారులు దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ ప్రయాణికురాలి వద్ద  పెద్ద మొత్తంలో బంగారాన్ని గుర్తించారు. ఆ మహిళ నుంచి 11.1 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ 3.6 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న 7 క్లాత్‌ ప్యాకెట్స్‌తో పాటు, సాక్స్‌లలో ఆమె బంగారం తీసుకోచ్చినట్టు అధికారులు వివరించారు. అంతేకాకుండా గత మూడు నెలలుగా ఆ మహిళ నివాసం ఉంటున్న ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ రూమ్‌లో సైతం తనిఖీలు చేపట్టిన అధికారులు స్మగుల్డ్‌ గూడ్స్‌తో పాటు భారీగా విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆ మహిళను అరెస్ట్‌ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement