ఖతార్ నుంచి అక్రమంగా బంగారాన్ని నగరానికి తీసుకువచ్చిన ఓ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు గురువారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు.
ఖతార్ నుంచి అక్రమంగా బంగారాన్ని నగరానికి తీసుకువచ్చిన ఓ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు గురువారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణికుడి వద్ద నుంచి 1.9 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు ఉదయం ఖతార్ నుంచి నగరానికి చేరుకున్న ఆ ప్రయాణికుడి లగేజిని తనిఖీలు నిర్వహిస్తుండగా ఆ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు కనుగొన్నారు. దాంతో ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం సదరు ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అందులోభాగంగా తన పేరు మహ్మద్ అలిఫా అని, తన స్వస్థలం కేరళ అని కస్టమ్స్ అధికారులకు ప్రయాణికుడు వెల్లడించాడు.