పట్టుబడిన బంగారు బిస్కెట్లు
శంషాబాద్ (హైదరాబాద్): దుబాయ్ నుంచి ముగ్గురు వేర్వేరు ప్రయాణికులు అక్రమంగా తీసుకొచ్చిన రూ.నాలుగుకోట్ల పైచిలుకు విలువైన బంగారాన్ని శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలివి. దుబాయ్ ఈకే –528 విమానంలో వచ్చిన ఒక ప్రయాణికుడి లగేజీని తనిఖీ చేయగా అందులో సిల్వర్ కోటింగ్ చేసి ఉన్న ఎయిర్‌కంప్రెసర్ కనిపించింది. దాన్ని పరిశీలించగా 4,895 గ్రాముల బరువున్న ఇరవైనాలుగు క్యారట్ల బంగారం బ్లాకు బయటపడింది. బంగారం విలువ రూ.2.57 కోట్లు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మరో ఇద్దరి నుంచి..: దుబాయ్ నుంచి ఈకే–524 విమానంలో వచ్చిన ఇద్దరు ప్రయాణికుల లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేయగా అందులో 2,800 గ్రాముల బరువున్న బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. బంగారం విలువ రూ.1.47 కోట్లు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment