
బురఖాలో బంగారపు బిస్కెట్లు
దుబాయి నుంచి మూడు కిలోల బంగారాన్ని అక్రమంగా నగరానికి తీసుకువచ్చిన ఫాతిమా సాహిన్ అనే మహిళను కస్టమ్స్ అధికారులు బుధవారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు.
దుబాయి నుంచి మూడు కిలోల బంగారాన్ని అక్రమంగా నగరానికి తీసుకువచ్చిన ఫాతిమా సాహిన్ అనే మహిళను కస్టమ్స్ అధికారులు బుధవారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి ఆ బంగారాన్నీ స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. బుధవారం ఉదయం దుబాయి నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు చేరుకున్న ప్రయాణికురాలు ఫాతిమాను కస్టమ్స్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు.
అయితే తనిఖీలు చేస్తున్న క్రమంలో ఆమె బురఖాలోని వివిధ ప్రదేశాలలో బంగారపు బిస్కెట్లు పెట్టి కుట్టివేసినట్లు గుర్తించారు. ఆ బంగారు బిస్కేట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం బిస్కెట్లు మూడు కిలోల బంగారం వరకు ఉంటుందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఫాతిమా సాహిన్ పై కేసు నమోదు చేసి కస్టమ్స్ అధికారులు విచారిస్తున్నారు. ఫాతిమా స్వస్థలం హైదరాబాద్ అని చెప్పినట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.