
దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు మహిళల అరెస్ట్
హైదరాబాద్: దుబాయి నుంచి నగరానికి వచ్చిన ఇద్దరు మహిళల నుంచి 3.3 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున దుబాయి ఎయిర్ లైన్స్ విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న ప్రయాణికుల లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్బంగా సదరు మహిళల లగేజీలో 3.3 కిలోల బంగారం ఉన్నట్లు గుర్తించారు. దాంతో ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ మార్కెట్లో రూ. కోటి ఉంటుందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.