తిరువొత్తియూరు: సింగపూర్ నుంచి తిరుచ్చికి విమానంలో బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరిని విమానాశ్రయ అధికారులు అరెస్టు చేశారు. సింగపూర్ నుంచి తిరుచ్చికి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం తిరుచ్చికి వచ్చింది. ఈ విమానం నుంచి దిగిన ప్రయాణికుల వద్ద కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు.
తనిఖీ ల్లో ఇద్దరు ప్రయాణికుల వద్ద 250 గ్రాము ల బరువు కలిగిన ఆరు బంగారు బిస్కెట్లు ఉన్నట్టు గుర్తించారు. ఈ బంగారం విలువ రూ. 5.9 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. విచారణలో బంగారం తరలించిన వ్యక్తులు మదురై జిల్లా మేలూరు కొట్టాం పట్టికి చెందిన సెంథిల్, రత్నం అని తెలిసింది.