Tiruchi airport
-
ల్యాప్‌టాప్ కీబోర్డులో పట్టుబడ్డ రూ. 1.3 కోట్ల బంగారం
సాక్షి, చెన్నై: తమిళనాడు విమానాశ్రంయలో ల్యాప్‌టాప్‌లో దాచిన సుమారు 1.3 కోట్ల విలువైన బంగారం దొరికింది. తమిళనాడులోని తిరుచ్చి విమానాశ్రయంలో దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికులకు చెందిన ల్యాప్‌టాప్‌లో దాదాపు ₹ 1.3 కోట్ల విలువైన బంగారాన్ని దాచి ఉంచారని పోలీసులు తెలిపారు. ముగ్గురు ప్రయాణికులు నుంచి సుమారు రూ. 1.98 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ల్యాప్‌టాప్ కీబోర్డు కింద ఉండే ప్రాంతంలో బంగారాన్ని దాచినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు మే 11న షార్జా మీదుగా భారత్‌కు చేరుకున్న ఆ ముగ్గురు ప్రయాణికులను కస్టమ్స్ విభాగం అరెస్టు చేసింది. (చదవండి: పెళ్లి ఊరేగింపులో విషాదం...వధువు తల్లిని కత్తితో పొడిచి...) -
ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం
చెన్నై: తిరుచ్చి విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. విమానం రన్‌పైకి వెళ్లే సమయంలో సిగ్నల్ టవర్‌ను తాకుతూ వెళ్లింది. విమానాశ్రయ సిబ్బంది అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటన జరిగిన సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం తిరుచ్చి నుంచి దుబాయ్ వెళ్లాల్సి ఉంది. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. -
5.9 లక్షల విలువైన బంగారం పట్టివేత
తిరువొత్తియూరు: సింగపూర్ నుంచి తిరుచ్చికి విమానంలో బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరిని విమానాశ్రయ అధికారులు అరెస్టు చేశారు. సింగపూర్ నుంచి తిరుచ్చికి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం తిరుచ్చికి వచ్చింది. ఈ విమానం నుంచి దిగిన ప్రయాణికుల వద్ద కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. తనిఖీ ల్లో ఇద్దరు ప్రయాణికుల వద్ద 250 గ్రాము ల బరువు కలిగిన ఆరు బంగారు బిస్కెట్లు ఉన్నట్టు గుర్తించారు. ఈ బంగారం విలువ రూ. 5.9 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. విచారణలో బంగారం తరలించిన వ్యక్తులు మదురై జిల్లా మేలూరు కొట్టాం పట్టికి చెందిన సెంథిల్, రత్నం అని తెలిసింది.