పన్ను రశీదు లేకపోవడంతో పోలీసులు స్వాదీనం చేసుకున్న బంగారు బిస్కెట్లు
కర్నూలు: ఎస్‌ఈబీ తనిఖీల్లో పన్ను రశీదుల్లేని రూ.6.86 కోట్ల బంగారం పట్టుబడింది. కర్నూలు శివారు పంచలింగాల చెక్‌పోస్టు వద్ద ఎస్‌ఈబీ సిబ్బంది గురువారం రాత్రి జరిపిన వాహన తనిఖీల్లో 14.8 కిలోల బంగారాన్ని స్వాదీనం చేసుకున్నారు. శుక్రవారం కర్నూలు డీఎస్పీ కేవీ మహేష్ వెల్లడించిన వివరాల మేరకు.. వైఎస్సార్ జిల్లా తాళ్లప్రొద్దుటూరుకు చెందిన రాతి మిద్దెరాజు.. తాడిపత్రి పట్టణం అంబటి పుల్లారెడ్డి జ్యువెలర్స్‌లో గుమాస్తా.
ఆయన హైదరాబాద్ అబిడ్స్‌లోని ఓ గోల్డ్ షాప్‌లో 163 బంగారు బిస్కెట్లను తీసుకున్నాడు. వాటిలో 15 బిస్కెట్లను హైదరాబాద్‌లోని వేర్వేరు చోట్ల అప్పగించాడు. మిగిలిన 148 బిస్కెట్లను బ్యాగ్‌లో ఉంచుకుని హైదరాబాద్ నుంచి ఆర్టీసీ బస్సులో తాడిపత్రికి వెళుతున్నాడు. పన్ను చెల్లింపు బిల్లులు చూపకపోవడంతో చెక్‌పోస్టు వద్ద ఎస్‌ఈబీ సిబ్బంది వాటిని స్వాదీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment