మళ్లీ అక్కడే... రూ.రెండు కోట్ల బంగారం దొరికింది | Rs.4 crores worth gold seized in tuticorin port | Sakshi
Sakshi News home page

మళ్లీ అక్కడే... రూ.రెండు కోట్ల బంగారం దొరికింది

Published Tue, Feb 16 2016 11:29 AM | Last Updated on Sun, Sep 3 2017 5:46 PM

మళ్లీ అక్కడే... రూ.రెండు కోట్ల బంగారం దొరికింది

మళ్లీ అక్కడే... రూ.రెండు కోట్ల బంగారం దొరికింది

చెన్నై : తమిళనాడులోని టుటికోరన్ నౌకాశ్రయంలో మంగళవారం డీఆర్ఐ అధికారులు ఆరు కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ బంగారాన్ని సీజ్ చేశారు. నౌకాశ్రయంలో తరలించేందుకు సిద్ధంగా ఉంచిన పార్సిల్లో బంగారం ఉన్నట్లు ఆగంతకుడి ద్వారా సమాచారం అందుకున్న డీఆర్ఐ అధికారులు... ఆ దిశగా తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆరు కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ రూ. 2 కోట్లు ఉంటుందని డీఆర్ఐ అధికారులు వెల్లడించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా సదరు పార్సిల్ ఎవరు పంపారు. పార్సిల్ పై గల చిరునామా గురించి డీఆర్ఐ అధికారులు ఆరా తీస్తున్నారు.

గత గురువారం ఇదే నౌకాశ్రయం నుండి కౌలాలంపూర్కు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన పార్సిల్ నుంచి 12 కేజీల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement