Rs.4 crores
-
రూ.4.3 కోట్ల వేతనం: జాక్‌పాట్ కొట్టిన ఐఐటీ స్టూడెంట్
గ్లోబల్ ట్రేడింగ్ సంస్థ జేన్ స్ట్రీట్.. ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీలలోని(IITs) 2025 బ్యాచ్ విద్యార్థుల కోసం బేస్, ఫిక్స్డ్ బోనస్ & రీలొకేషన్ వంటి వాటితో సహా మొత్తం రూ. 4.3 కోట్లకు పైగా అత్యధిక వేతన ఆఫర్‌ను అందించింది. ఈ ఆఫర్ ఐఐటీ మద్రాస్‌కు చెందిన కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థి సొంతం చేసుకున్నారు.ఐఐటీ ఢిల్లీ, బాంబే, మద్రాస్, కాన్పూర్, రూర్కీ, ఖరగ్‌పూర్, గౌహతి, బీహెచ్‌యూలలో ఆదివారం తుది నియామకాలు ప్రారంభమైన సమయంలో ఈ ఆఫర్ వెలువడింది.ఎక్కువ శాలరీ ఫ్యాకేజీ ఆఫర్ చేసిన కంపెనీల జాబితా➤బ్లాక్‌రాక్, గ్లీన్ & డావిన్సీ: రూ. 2 కోట్ల కంటే ఎక్కువ.➤ఏపీటీ పోర్ట్‌ఫోలియో అండ్ రూబ్రిక్: రూ. 1.4 కోట్ల కంటే ఎక్కువ➤డేటాబ్రిక్స్, ఎబుల్లియెంట్ సెక్యూరిటీస్, ఐఎంసీ ట్రేడింగ్: రూ. 1.3 కోట్ల కంటే ఎక్కువ➤క్వాడే: సుమారు రూ.1 కోటి➤క్వాంట్‌బాక్స్ అండ్ గ్రావిటన్: రూ. 90 లక్షలు.➤డీఈ షా: రూ. 66 లక్షల నుంచి రూ. 70 లక్షల మధ్య➤పేస్ స్టాక్ బ్రోకింగ్: రూ. 75 లక్షలు➤స్క్వేర్‌పాయింట్ క్యాపిటల్: రూ. 66 లక్షల కంటే ఎక్కువ➤మైక్రోసాఫ్ట్: రూ. 50 లక్షల కంటే ఎక్కువ➤కోహెసిటీ: రూ. 40 లక్షలుమొదటి రోజు వచ్చిన రిక్రూటర్లలో క్వాల్కమ్, మైక్రోసాఫ్ట్, గోల్డ్‌మన్ సాక్స్, బజాజ్ ఆటో, ఓలా ఎలక్ట్రిక్, అల్ఫోన్సో, న్యూటానిక్స్ కంపెనీలు ఉన్నట్లు సమాచారం. గత సీజన్‌తో పోలిస్తే.. ఈ సీజన్లో భారీ ప్యాకేజీలను ప్రకటించారు. -
రూ.4 కోట్లతో పురాతన ఆలయాల పునర్నిర్మాణం
ఆకివీడు : జిల్లాలోని పురాతన ఆలయాల పునర్నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్టు దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి.ఎన్.శ్రీనివాసరావు చెప్పారు. స్థానిక పురాతన వల్లీ సమేత భీమేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలో పది ఆలయాలను రూ.4 కోట్లతో పునర్నిర్మిస్తున్నామని చెప్పారు. బలుసుమూడి ఆలయం పునర్నిర్మాణానికి రూ. 1.06 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. మిగిలిన ఆలయాలకు రూ.40 లక్షల నుంచి, రూ. 50 లక్షలు కేటాయించామని, వీటితోపాటు దాతల విరాళాలు ఇచ్చారని, పునర్నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. వెనుకబడిన ప్రాంతాల్లో ఆలయాలు నిర్మిస్తే రూ. 5 లక్షలు ప్రభుత్వం, టీటీడీ సమకూర్చుతాయని వెల్లడించారు. వెనుకబడి, గిరిజన తండాల్లో వీటిని నిర్మించాల్సి ఉంటుందన్నారు. భీమేశ్వరస్వామి ఆలయం పునర్నిర్మాణానికి రూ. 40 లక్షలు మంజూరు చేశామని, దాతల విరాళం రూ.కోటితో నిర్మాణం పూర్తి చేయాలని యోచిస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే మార్చి నాటికి ప్రతిష్ఠ ఉత్సవం నిర్వహించాలనే యోచనలో ఉన్నామని వివరించారు. ఈ ఆలయానికి కావాల్సిన ధ్వజస్తంభం ఏర్పాటుకు అటవీశాఖ అనుమతి లభించిందని, ఏ అడవుల్లో ధ్వజస్తంభానికి అనువైన టేకుచెట్టు ఉందో పరిశీలించడానికి ప్రత్యేక బృందం వెళ్లనుందని వివరించారు. ఏఈఈ వెంట దేవస్థానాల మేనేజర్ పి.ఫణికిషోర్, సర్పంచ్ గొంట్లా గణపతి, ఆలయ నిర్వహణ కమిటీ చైర్మన్ సన్నిథి వెంకన్నబాబు, గుర్రం శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
మళ్లీ అక్కడే... రూ.రెండు కోట్ల బంగారం దొరికింది
చెన్నై : తమిళనాడులోని టుటికోరన్ నౌకాశ్రయంలో మంగళవారం డీఆర్ఐ అధికారులు ఆరు కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ బంగారాన్ని సీజ్ చేశారు. నౌకాశ్రయంలో తరలించేందుకు సిద్ధంగా ఉంచిన పార్సిల్లో బంగారం ఉన్నట్లు ఆగంతకుడి ద్వారా సమాచారం అందుకున్న డీఆర్ఐ అధికారులు... ఆ దిశగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరు కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ రూ. 2 కోట్లు ఉంటుందని డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా సదరు పార్సిల్ ఎవరు పంపారు. పార్సిల్ పై గల చిరునామా గురించి డీఆర్ఐ అధికారులు ఆరా తీస్తున్నారు. గత గురువారం ఇదే నౌకాశ్రయం నుండి కౌలాలంపూర్‌కు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన పార్సిల్ నుంచి 12 కేజీల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. -
పత్తి కొనుగోలు కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం
మహబూబ్‌నగర్ (గద్వాల్): మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ మండలంలోని కొండపల్లి రోడ్డు మార్గంలో ఉన్న సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రంలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగసి పడుతున్నాయి. ఆ ప్రాంతాన్ని దట్టమైన పొగలు కమ్మేశాయి. సుమారు రూ. 4 కోట్ల విలువ చేసే 4 వేల క్వింటాళ్ల పత్తి, 916 పత్తి బేళ్లు దగ్దం అయినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం ఎలా సంభవించిందనే విషయం తెలియరాలేదు. మంటలను ఆర్పేందుకు మూడు ఫైరింజన్లు శతవిధాలా శ్రమిస్తున్నాయి. మరో రెండు మూడు గంటల తర్వాతనే మంటలు అదుపులోకి రావచ్చని అధికారులు చెబుతున్నారు. గోదాంలో ఉన్న పత్తికి బీమా ఉంది.