రూ.4.3 కోట్ల వేతనం: జాక్‌పాట్‌ కొట్టిన ఐఐటీ స్టూడెంట్ | IIT Madras Student Gets Rs 4 3 Crore Job Offer | Sakshi
Sakshi News home page

రూ.4.3 కోట్ల వేతనం: జాక్‌పాట్‌ కొట్టిన ఐఐటీ స్టూడెంట్

Published Mon, Dec 2 2024 7:24 PM | Last Updated on Mon, Dec 2 2024 7:37 PM

IIT Madras Student Gets Rs 4 3 Crore Job Offer

గ్లోబల్ ట్రేడింగ్ సంస్థ జేన్ స్ట్రీట్.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీలలోని(IITs) 2025 బ్యాచ్ విద్యార్థుల కోసం బేస్, ఫిక్స్‌డ్ బోనస్ & రీలొకేషన్‌ వంటి వాటితో సహా మొత్తం రూ. 4.3 కోట్లకు పైగా అత్యధిక వేతన ఆఫర్‌ను అందించింది. ఈ ఆఫర్ ఐఐటీ మద్రాస్‌కు చెందిన కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థి సొంతం చేసుకున్నారు.

ఐఐటీ ఢిల్లీ, బాంబే, మద్రాస్, కాన్పూర్, రూర్కీ, ఖరగ్‌పూర్, గౌహతి, బీహెచ్‌యూలలో ఆదివారం తుది నియామకాలు ప్రారంభమైన సమయంలో ఈ ఆఫర్ వెలువడింది.

ఎక్కువ శాలరీ ఫ్యాకేజీ ఆఫర్ చేసిన కంపెనీల జాబితా
➤బ్లాక్‌రాక్, గ్లీన్ & డావిన్సీ: రూ. 2 కోట్ల కంటే ఎక్కువ.
➤ఏపీటీ పోర్ట్‌ఫోలియో అండ్ రూబ్రిక్: రూ. 1.4 కోట్ల కంటే ఎక్కువ
➤డేటాబ్రిక్స్, ఎబుల్లియెంట్ సెక్యూరిటీస్, ఐఎంసీ ట్రేడింగ్: రూ. 1.3 కోట్ల కంటే ఎక్కువ
➤క్వాడే: సుమారు రూ.1 కోటి
➤క్వాంట్‌బాక్స్ అండ్ గ్రావిటన్: రూ. 90 లక్షలు.
➤డీఈ షా: రూ. 66 లక్షల నుంచి రూ. 70 లక్షల మధ్య
➤పేస్ స్టాక్ బ్రోకింగ్: రూ. 75 లక్షలు
➤స్క్వేర్‌పాయింట్ క్యాపిటల్: రూ. 66 లక్షల కంటే ఎక్కువ
➤మైక్రోసాఫ్ట్: రూ. 50 లక్షల కంటే ఎక్కువ
➤కోహెసిటీ: రూ. 40 లక్షలు

మొదటి రోజు వచ్చిన రిక్రూటర్లలో క్వాల్కమ్, మైక్రోసాఫ్ట్, గోల్డ్‌మన్ సాక్స్, బజాజ్ ఆటో, ఓలా ఎలక్ట్రిక్, అల్ఫోన్సో, న్యూటానిక్స్ కంపెనీలు ఉన్నట్లు సమాచారం. గత సీజన్‌తో పోలిస్తే.. ఈ సీజన్‌లో భారీ ప్యాకేజీలను ప్రకటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement