కర్నూలు జిల్లాలో ఓ వ్యక్తి నుంచి మూడు కేజీల బంగారాన్ని బుధవారం సాయంత్రం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఎమ్మిగనూరు: కర్నూలు జిల్లాలో ఓ వ్యక్తి నుంచి మూడు కేజీల బంగారాన్ని బుధవారం సాయంత్రం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మిగనూరులోని షరాబ్ బజారులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.
అతని నుంచి మూడు కిలోల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తి ముంబైకి చెందిన నితీష్‌గా గుర్తించారు. అతడు స్థానిక బంగారు నగల వ్యాపారులతో జీరో బిజినెస్ చేస్తాడని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.