తొలి ఆధార్‌ ఆధారిత ఎయిర్‌పోర్టు ఇదే! | Bengaluru's all set to become first aadhaar-enabled airport | Sakshi
Sakshi News home page

తొలి ఆధార్‌ ఆధారిత ఎయిర్‌పోర్టు ఇదే!

Published Mon, Oct 9 2017 2:49 PM | Last Updated on Mon, Oct 9 2017 6:58 PM

Bengaluru's all set to become first aadhaar-enabled airport

ఆధార్‌ ఉంటేనే విమానయానం చేసేలా కేంద్ర​ ప్రభుత్వం అన్ని రకాల ప్లాన్లను సిద్ధం చేస్తోంది. బెంగళూరు కెమ్పెగ్వాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆధార్‌ ఆధారిత తొలి ఎయిర్‌పోర్టుగా ప్రాచుర్యంలోకి తీసుకు రాబోతుంది. ఆధార్‌ ఆధారిత ప్రవేశాన్ని, బయోమెట్రిక్‌ బోర్డింగ్‌ సిస్టమ్‌ ఈ ఎయిర్‌పోర్టుకు ఏర్పాటుచేస్తోంది. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయ లిమిటెడ్‌ కొత్త ఆధార్‌ ప్రక్రియ కోసం 325 రోజుల డెడ్‌లైన్‌ను కూడా విధించింది. 2018 మార్చి నుంచి ఈ ప్రాజెక్టు అమల్లోకి రాబోతుంది.

అంతర్జాతీయ విమానాల కోసం బోర్డింగ్‌కు వచ్చిన ప్రయాణికులు ఈ కొత్త ప్రక్రియను 2018 అక్టోబర్‌ నుంచి ఉపయోగించుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2018 డిసెంబర్‌ 31 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి కాబోతుందని తెలుస్తోంది. భద్రతను మెరుగుపరుచుకునేందుకు, క్లియరెన్స్‌ను వేగవంతం చేయడానికి, ఎయిర్‌పోర్టులో ఆలస్యాలను తగ్గించడానికి ఈ ప్రక్రియ ఎంతో ఉపయోగపడనుంది. అదనంగా ఎయిర్‌పోర్టు జర్నీలో పలు ప్రదేశాల్లో ఐడీలు, బోర్డింగ్‌ పాస్‌లు చూపించాల్సినవసరం లేకుండా ఈ ఆధార్‌ ప్రక్రియ వస్తోంది.     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement