బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ విమానం అత్యవసర ల్యాండింగ్‌ | 'British Airways' emergency landing | Sakshi
Sakshi News home page

బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ విమానం అత్యవసర ల్యాండింగ్‌

Published Wed, Dec 21 2016 12:39 AM | Last Updated on Mon, Sep 4 2017 11:12 PM

'British Airways' emergency landing

హైదరాబాద్‌: బెంగళూరు విమానాశ్రయంలో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ విమానాన్ని మంగళవారం ఉదయం శంషాబాద్‌ విమానా శ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్‌ చేశారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు లండన్‌ నుంచి బయలుదేరిన ఈ విమానం మంగళవారం ఉదయం 6 గంటలకు బెంగళూరులో ల్యాండ్‌ కావల్సి ఉంది.

అయితే బెంగళూరు ఎయిర్‌పోర్టులో పొగ మంచు కారణంగా విమానాన్ని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు ఏటీసీ అధికారుల అను మతితో శంషాబాద్‌లో ల్యాండ్‌ చేశారు. 2 గంటల తర్వాత విమానం తిరిగి టేకాఫ్‌ తీసుకుని బెంగళూరు బయలుదేరినట్లు విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement