టేకాఫ్ అయిన కాసేపటికే విమానం ల్యాండింగ్ | british airways flight take off in shamshabad airport | Sakshi
Sakshi News home page

టేకాఫ్ అయిన కాసేపటికే విమానం ల్యాండింగ్

Published Sat, Jun 11 2016 10:22 AM | Last Updated on Mon, Sep 4 2017 2:15 AM

టేకాఫ్ అయిన కాసేపటికే విమానం ల్యాండింగ్

టేకాఫ్ అయిన కాసేపటికే విమానం ల్యాండింగ్

హైదరాబాద్: టేకాఫ్ అయిన పది నిముషాలకే బ్రిటిష్ ఎయిర్‌వేస్‌ విమానం ల్యాండింగ్ అయిన సంఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి బ్రిటిష్ ఎయిర్వేస్ విమానం శనివారం ఉదయం టేకాఫ్ తీసుకుని లండన్ బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్ గుర్తించి... అప్రమత్తమైయ్యాడు.

సాంకేతిక సమస్యపై శంషాబాద్ విమానాశ్రయ అధికారులకు వివరించాడు. దీంతో విమానం తిరిగి వెనక్కి వచ్చేందుకు శంషాబాద్ విమానాశ్రయ అధికారుల అనుమతి తీసుకున్నాడు. అనంతరం విమానం శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేశాడు.

పది నిముషాల్లోనే విమానాన్ని తిరిగి ల్యాండింగ్ కావడంతో  ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఏమైందో తెలియక వారు ఆందోళన చెందారు. సాంకేతి సమస్య తలెత్తిందని విమాన సిబ్బంది చెప్పారు. మరమ్మతులు పూర్తి చేసుకుని గంట తర్వాత విమానం మళ్లీ తిరిగి లండన్ బయలుదేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement