
జెనరిక్ ఔషధ మార్కెట్ వృద్ధిపై దృష్టిపెట్టండి
ఫార్మా కంపెనీలకు అసోచామ్ సూచన
కోల్‌కతా: కొత్త ఔషధాల ఆవిష్కరణలతోపాటు, జెనరిక్ ఔషధ మార్కెట్ వృద్ధిపై భారత ఫార్మా కంపెనీలు దృష్టి కేంద్రీకరించాలని అసోచామ్ సూచించింది. అసోచామ్ అధ్యయనం ప్రకారం,కొత్త ఔషధాల ఆవిష్కరణలపైన ఫార్మా కంపెనీల వృద్ధి ఆధారపడి ఉంటుంది. కంపెనీ వృద్ధిలో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్ అండ్ డీ) ప్రధాన భూమిక పోషిస్తుందని, దీనిపైనే ఫార్మా కంపెనీలు చాలా అధిక మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నాయి.
- కొత్త మాలిక్యూలర్‌ను అభివృద్ధిపర్చేందుకు వెచ్చించాల్సిన మొత్తం గత ఐదేళ్లలో రెట్టింపై 1.5 బిలియన్ డాలర్లకు చేరింది.
- అయినా గత రెండేళ్ల నుంచి అధిక టర్నోవర్‌ను తెచ్చిపెట్టే ఏ ఒక్క కొత్త ఔషధం యూఎస్ ఎఫ్‌డీఏ అనుమతిని పొంద లేదు.
- ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న కాలంలో జెనరిక్ ఔషధ మార్కెట్‌లో వృద్ధి క్షీణత కనిపించనుంది.
- 2013-14లో భారత ఔషధ పరిశ్రమ విలువ ఎగుమతులతో కలిపి 34 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది 2017-18 నాటికి ఈ విలువ 48 బిలియన్ డాలర్లకు చేరనుంది.