రూ. 5,260 కోట్ల పెట్టుబడులు.. 12,490 ఉద్యోగాలు | Six pharma companies sign MoU with Telangana govt for Pharma City: CM Revanth Reddy and Sridhar Babu | Sakshi
Sakshi News home page

రూ. 5,260 కోట్ల పెట్టుబడులు.. 12,490 ఉద్యోగాలు

Published Sat, Nov 23 2024 4:15 AM | Last Updated on Sat, Nov 23 2024 4:15 AM

Six pharma companies sign MoU with Telangana govt for Pharma City: CM Revanth Reddy and Sridhar Babu

రాష్ట్ర ప్రభుత్వంతో ఆరు ఫార్మా కంపెనీల అవగాహన ఒప్పందాలు

సచివాలయంలో సీఎం రేవంత్, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబుతో కంపెనీల ప్రతినిధుల భేటీ 

ప్రతిపాదిత ఫార్మాసిటీలో 4 నెలల్లో ఆయా సంస్థలకు స్థలాలు కేటాయించాలని అధికారులకు సీఎం ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కాలుష్యరహిత గ్రీన్‌ ఫార్మా యూనిట్లను నెలకొల్పేందుకు, ప్రస్తుతమున్న కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రముఖ ఫార్మా కంపెనీలు ముందుకొచ్చాయి. ఎంఎస్‌ఎన్‌ గ్రూప్, లారస్‌ ల్యాబ్స్, గ్లాండ్‌ ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌ లే»ొరేటరీస్, అరబిందో ఫార్మా, హెటెరో ల్యాబ్స్‌ కంపెనీలు రూ. 5,260 కోట్ల పెట్టుబడులకు సంబంధించి శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకున్నాయి.

ఈ పెట్టుబడుల ద్వారా కొత్తగా 12,490 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ప్రతిపాదిత ఫార్మాసిటీలో ఈ కంపెనీల యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని ప్రభుత్వం కేటాయించనుంది. సీఎం రేవంత్, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో సచివాలయంలో తొలుత డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ డైరెక్టర్‌ సతీశ్‌రెడ్డి, లారస్‌ ల్యాబ్స్‌ ఈడీ వివి రవికుమార్, గ్లాండ్‌ ఫార్మా సీఈవో శ్రీనివాస్, ఎంఎస్‌ ల్యాబ్స్‌ సీఎండీ ఎంఎస్‌ఎన్‌రెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్‌ మదన్‌మోహన్‌రెడ్డి, హెటెరో గ్రూప్‌ ఎండీ బి.వంశీకృష్ణ సమావేశమయ్యారు.

ఈ భేటీలో టీఎస్‌ఐఐసీ చైర్‌పర్సన్‌ నిర్మలా జగ్గారెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, విష్ణువర్దన్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎంవోయూలపై కంపెనీల ప్రతినిధులు సంతకాలు చేశారు. మరో నాలుగు నెలల్లో ఫార్మా కంపెనీలు నిర్మాణ పనులు చేపట్టేందుకు వీలుగా స్థలాలను కేటాయించడంతోపాటు ఫార్మాసిటీలో సదుపాయాలు కలి్పంచాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. 

యూనిట్లు ఇలా.. 
ఈ ఒప్పందాల ప్రకారం ఎంఎస్‌ఎన్‌ లే»ొరేటరీ తయారీ యూనిట్‌తోపాటు పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. లారస్‌ ల్యాబ్స్, అరబిందో ఫార్మా ఫార్ములేషన్‌ యూనిట్లు నెలకొల్పనున్నాయి. అలాగే గ్లాండ్‌ ఫార్మా సంస్థ ఆర్‌ అండ్‌ డీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతోపాటు ఇంజెక్టబుల్స్, డ్రగ్‌ సబ్‌స్టెన్స్‌ మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్లను స్థాపించనుంది. ఇక డాక్టర్‌ రెడ్డీస్‌ లాబ్స్‌ ఇంజెక్టబుల్, బయో సిమిలర్ల యూనిట్‌ ఏర్పాటు చేయనుండగా హెటెరో ల్యాబ్స్‌ ఫినిషిడ్‌ డోస్, ఇంజెక్టబుల్‌ తయారీ పరిశ్రమను నెలకొల్పనుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement