
విదేశీ సంకేతాలు అటూఇటుగా ఉన్నప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ 144 పాయింట్లు పెరిగి 38,182 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం56 పాయింట్లు బలపడి 11,270 వద్ద ముగిసింది. యూఎస్, ఆసియా మార్కెట్లు అటూఇటుగా ముగిసినప్పటికీ దేశీయంగా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ఆసక్తి చూపారు. ప్రధానంగా ఫార్మా కౌంటర్లు, డిఫెన్స్ రంగ షేర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ తొలుత గరిష్టంగా 38,431 వరకూ ఎగసింది. చివర్లో కాస్త మందగించి 38,073 వరకూ వెనకడుగు వేసింది. ఈ బాటలో నిఫ్టీ 11,337-11,238 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులు నమోదు చేసుకుంది.
సిప్లా జోరు
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ బలపడగా.. ఫార్మా అత్యధికంగా 5.5 శాతం జంప్‌చేసింది. రియల్టీ దాదాపు 3 శాతం ఎగసింది. ఐటీ, మెటల్, ఆటో, బ్యాంకింగ్ 1 శాతం చొప్పున పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో సిప్లా 9.5 శాతం దూసుకెళ్లగా.. ఎంఅండ్‌ఎం, ఎల్‌అండ్‌టీ, టాటా మోటార్స్, సన్ ఫార్మా, ఎన్‌టీపీసీ, టెక్ మహీంద్రా, యూపీఎల్, డాక్టర్ రెడ్డీస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, శ్రీ సిమెంట్, ఐసీఐసీఐ, ఐటీసీ, ఎస్‌బీఐ, టాటా స్టీల్ 5-1.5 శాతం మధ్య ఎగశాయి. అయితే ఐషర్, ఏషియన్ పెయింట్స్, మారుతీ, బీపీసీఎల్, ఆర్‌ఐఎల్, బజాజ్ ఫిన్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్, నెస్లే, గ్రాసిమ్, టీసీఎస్ 2.2-0.5 శాతం మధ్య క్షీణించాయి.
దివీస్ దూకుడు
డెరివేటివ్స్‌లో దివీస్ ల్యాబ్ 12 శాతం దూసుకెళ్లగా.. బీఈఎల్, లుపిన్, నౌకరీ, ఐబీ హౌసింగ్, అరబిందో, అమరరాజా, మదర్‌సన్, పీఎఫ్‌సీ, డీఎల్‌ఎఫ్, గ్లెన్‌మార్క్ 9.5- 4.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క కంకార్ 15 శాతం కుప్పకూలింది. ఇతర కౌంటర్లలో ఆర్‌బీఎల్, ముత్తూట్, సీమెన్స్, బాటా, బంధన్ బ్యాంక్, మణప్పురం, మ్యాక్స్ ఫైనాన్స్, పేజ్, ఎంఆర్‌ఎఫ్ 5.5-1.25 శాతం మధ్య నీరసించాయి. బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 1.5 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,763 లాభపడగా.. 995 మాత్రమే నష్టాలతో నిలిచాయి.
డీఐఐల అమ్మకాలు
నగదు విభాగంలో శుక్రవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 397 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 439 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. ఇక గురువారం ఎఫ్‌పీఐలు రూ. 637 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 468 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment