
నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్‌అవుతున్న నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా షేర్లు జోరుగా ర్యాలీ చేస్తున్నాయి. ఉదయం 11:20 గంటల ప్రాంతంలో నిఫ్టీ ఫార్మా 1.3 శాతం లాభపడి రూ.9,202.75 వద్ద ట్రేడ్ అవుతోంది. ఉదయం సెషన్‌లో నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ రూ.9,098.70 వద్ద ప్రారంభమై ఒక దశలో రూ.9,251.70 వద్ద గరిష్టాన్ని తాకింది. ఈ ఇండెక్స్‌లో భాగమైన లుపిన్ 2.4 శాతం లాభపడి రూ.861 వద్ద, సిప్లా 2.4 శాతం లాభపడి రూ.609.50 వద్ద, పీఈఎల్ 2.27 శాతం లాభపడి రూ.900 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అరబిందో ఫార్మా 1.8 శాతం లాభపడి రూ.674.60 వద్ద, డాక్టర్ రెడ్డీస్ 1.5 శాతం లాభపడి రూ.3,754.95 వద్ద, బయోకాన్ 1శాతం లాభంతో రూ.340 వద్ద, కడీలా హెల్త్‌కేర్ 0.86 శాతం లాభపడి రూ.328.70 వద్ద, గ్లెన్‌మార్క్ 0.6శాతం లాభంతో రూ.334.35వద్ద, సన్‌ఫార్మా 0.53శాతం లాభంతో రూ.444 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.ఈ ఇండెక్స్‌లో భాగమైన దివీస్ ల్యాబ్ మాత్రం ఎటువంటి మార్పు లేకుండా రూ.2,321.75 వద్ద ట్రేడ్ అవుతోంది.