లాభాలతో షురూ- ఫార్మా హైజంప్‌ | Market up- Pharma sector jumps | Sakshi
Sakshi News home page

లాభాలతో షురూ- ఫార్మా హైజంప్‌

Published Fri, Sep 18 2020 9:45 AM | Last Updated on Fri, Sep 18 2020 9:47 AM

Market up- Pharma sector jumps - Sakshi

ముందు రోజు వాటిల్లిన నష్టాల నుంచి బయటపడుతూ దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 157 పాయింట్లు బలపడి 39,137ను తాకగా.. 44 పాయింట్ల లాభంతో 11,554 వద్ద నిఫ్టీ ట్రేడవుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 39,200- 39,065 పాయింట్ల మధ్య ఊగిసలాడగా.. నిఫ్టీ 11,584- 11,551 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. టెక్నాలజీ కౌంటర్లలో అమ్మకాలతో వరుసగా రెండో రోజు గురువారం యూఎస్‌ మార్కెట్లు డీలాపడ్డాయి. ప్రస్తుతం ఆసియాలో అధిక శాతం మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. 

ఫార్మా జోరు
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ బలపడగా.. ఫార్మా 3.2 శాతం ఎగసింది. నిఫ్టీ దిగ్గజాలలో సిప్లా, డాక్టర్‌ రెడ్డీస్, సన్‌ ఫార్మా 5-3 శాతం మధ్య జంప్‌చేయగా.. హిందాల్కో, టెక్ మహీంద్రా, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్‌, హీరో మోటో, టీసీఎస్‌, పవర్‌గ్రిడ్‌, అదానీ పోర్ట్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌ 2-1 శాతం మధ్య పుంజుకున్నాయి. అయితే హెచ్‌యూఎల్‌, మారుతీ, బజాజ్‌ ఆటో, ఇన్ఫోసిస్‌ మాత్రమే అదికూడా 1-0.2 శాతం మధ్య నీరసించాయి.

డెరివేటివ్స్‌లోనూ..
డెరివేటివ్‌ కౌంటర్లలో లుపిన్‌ 6 శాతం జంప్‌చేయగా.. గ్లెన్‌మార్క్‌, దివీస్‌, అరబిందో, వోల్టాస్‌, మదర్‌సన్‌, టొరంట్‌ ఫార్మా, కేడిలా హెల్త్‌, టీవీఎస్‌ మోటార్‌, అశోక్‌ లేలాండ్‌, అపోలో హాస్పిటల్స్‌ 4-1.2 శాతం మధ్య లాభపడ్డాయి. కాగా.. మరోపక్క జిందాల్‌ స్టీల్‌, కోఫోర్జ్‌, ఇండిగో, అపోలో టైర్‌, ఐడియా, ఐబీ హౌసింగ్‌, టొరంట్‌ పవర్‌, ముత్తూట్‌, బెర్జర్‌ పెయింట్స్‌, పిడిలైట్‌, ఎస్‌బీఐ లైఫ్‌, గోద్రెజ్‌ సీపీ, బంధన్‌ బ్యాంక్‌, కాల్గేట్‌, పీఎన్‌బీ 1.3-0.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.8-0.5 శాతం చొప్పున ఎగశాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1132 లాభపడగా.. 580 నష్టాలతో కదులుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement