ముంబై: అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో కదలాడుతుండటంతో దేశీ స్టాక్ మార్కెట్లు ఈ రోజు ఉదయం నుంచి లాభాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ ఉద్రిక్తల కారణంగా నెల రోజులకు పైగా లాభానష్టాల మధ్య ఊగిసలాడిన మార్కెట్లు ఈ రోజు ఎంతో నమ్మకంగా లాభాల బాట పట్టాయి. జపాన్ నిక్కీ 0.60 శాతం లాభపడగా దక్షిన కోరియా కోస్పీ సూచీ 0.26 శాతం వృద్ధి నమోదు చేసింది. మరోవైపు హాంగ్‌కాంగ్‌కి సంబంధించి హాంగ్‌సెంగ్ ఇండెక్స్ 0.39 శాతం, యూఎస్ నాస్‌డాక్ 1.31 శాతం వృద్ధిని చూపుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లకు తగ్గట్టే దేశీ సూచీలు జోరు చూపిస్తున్నాయి. ఉదయం 9:30 గంటల సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 183 పాయింట్లు లాభంతో 0.32 శాతం వృద్ధితో 57,777 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ 75 పాయింట్ల లాభంతో 0.44 శాతం వృద్ధి కనబరుస్తూ 17,297 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్, నిఫ్టీల కీలక నిరోధక పాయింట్లను దాటినందున మరికొద్ది రోజుల పాటు మార్కెట్‌లో బుల్ జోరు కొనసాగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
Comments
Please login to add a commentAdd a comment