ముంబై : దేశీ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఉదయం ఆరంభంలో రెండు సూచీలు కొంత దూకుడు చూపించినా.. ఆ తర్వాత అస్థితర మార్కెట్‌లో రాజ్యమేలింది. మూడు సెషన్లలోనూ రెండు సూచీలు లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. చివరకు రెండు సూచీలు నష్టాలతో ముగిశాయి.
ఈ రోజు ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్ 58779 పాయింట్లతో మొదలైంది. ఒక దశలో 58,890 పాయింట్ల గరిష్టాలను టచ్ చేసింది. ఆ తర్వాత తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. ఒక దశలో 58,485 పాయింట్ల కనిష్టాలను తాకింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 115 పాయింట్లు నష్టపోయి 58,568 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 33 పాయింట్లు నష్టపోయి 17,464 పాయింట్ల దగ్గర ముగిసింది.
రిలయన్స్, రెడ్డీస్, విప్రో, మారుతి, ఆల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్ సర్వీస్, కోటక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ షేర్లు నష్టపోగా ఎం అండ్ ఎం, హిందుస్థాన్ యూనిలీవర్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు లాభపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment