ముంబై: మార్కెట్ నిపుణుల అంచనాలను నిజం చేస్తూ ఈ వారం నష్టాలతో స్టాక్ మార్కెట్ ప్రారంభమైంది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, అమెరికా ఫెడ్ రిజర్వ్ నిర్ణయాలు, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, ఒమిక్రాన్ వ్యాప్తి వంటి అంశాలు మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. మరోవైపు గురువారంతో ఈ నెలకు సంబంధించిన ఎఫ్ అండ్ ఓ డెరివేటివ్స్ గడువు ముగిసిపోతుంది. దీంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా మార్కెట్ ఆరంభం కావడంతోనే రెండు దేశీ సూచీలు నష్టాలపాలయ్యాయి. గత రెండు వారాలుగా మార్కెట్‌లో కరెక‌్షన్ కొనసాగుతుండటంతో ఇన్వెస్టర్ల గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
సోమవారం ఉదయం 59,039 పాయింట్లతో బీఎస్‌ఈ సెన్సెక్స్ మొదలైంది. మార్కెట్ ఆరంభంలోనే ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టడంతో సెన్సెక్స్ భారీగా నష్టపోయింది. ఉదయం 9:50 గంటల సమయంలో 578 పాయింట్లు నష్టపోయి 58,459 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 145 పాయింట్లు నష్టపోయి 17,472 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. ఏషియన్ పేయింట్స్, బజాజ్ ఫిన్ కార్ప్, టెక్ మహీంద్రా, విప్రో, ఇన్ఫోసిస్, టైటాన్, హెచ్‌సీఎల్ షేర్లు నష్టపోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతి సుజుకి, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు లాభాల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment