
ముంబై: ఫార్మా కంపెనీలు రానున్న మూడేళ్లలో ప్రస్తుత ఇబ్బందుల నుంచి గట్టెక్కుతాయని రేటింగ్ సంస్థ క్రిసిల్ అభిప్రాయపడింది. నియంత్రణ సంస్థల కఠినమైన నిబంధనలు, అంతకంతకూ తీవ్రమవుతున్న పోటీ కారణంగా గత కొంతకాలంగా ఫార్మా కంపెనీలు ఎగుమతుల్లో సమస్యలు ఎదుర్కొంటున్నాయని క్రిసిల్ తన తాజా నివేదికలో వివరించింది. దేశీయంగా డిమాండ్ జోరుగా ఉండటం, పశ్చిమ దేశాల్లో సంక్లిష్ట ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుండటం ఫార్మా కంపెనీలకు కలసిరానుందని పేర్కొంది. ఫలితంగా రానున్న మూడేళ్లలో ఫార్మా కంపెనీల ఆదాయాలు ఏడాదికి 9 శాతం చొప్పున పెరుగుతాయని ఆ నివేదిక
అంచనా వేసింది. ముఖ్యాంశాలు...
►ఫార్మా కంపెనీలకు ఎగుమతులే కీలకం. ఎందుకంటే మొత్తం ఫార్మా రంగం ఆదాయంలో 45% వాటా ఎగుమతులదే. దేశీ అమ్మకాలు పుంజుకున్నా, ఎగుమతులు మాత్రం వచ్చే ఆర్థిక సంవత్సరంలో 1 శాతమే పెరుగుతాయి. ఆ తర్వాత మరింతగా పుంజుకుంటాయి.
►తీవ్రమైన పోటీ వల్ల ధరలు తగ్గడం, కొత్త ఔషధాలను మార్కెట్లోకి విడుదల చేయడంలో జాప్యం, అమెరికా ఎఫ్‌డీఏ కఠినమైన తనిఖీల కారణంగా ఆంక్షల విధింపు తదితర అంశాల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 5% క్షీణిస్తాయి.
►అయితే తర్వాతి కాలంలో ఎగమతుల ఆదాయం పుంజుకుంటుంది. సంక్లిష్టమైన ఔషధ ఉత్పత్తులకు అమెరికా ఎఫ్‌డీఏ సత్వర ఆమోదాలు జారీ చేయనుండటం దీనికొక కారణం.
►నియంత్రణలు అధికంగా ఉన్న అమెరికా వం టి మార్కెట్లలో సంక్లిష్ట ఔషధాలకు ఏటా 2,000 కోట్ల డాలర్ల అవకాశాలుండటంతో ఫా ర్మా కంపెనీలు పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) కోసం అధికంగానే నిధులు కేటాయిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment