7 నెలల గరిష్టం- సెన్సెక్స్‌@ 40,180 | Sensex @40,000-7 months high- IT, Pharma up | Sakshi
Sakshi News home page

7 నెలల గరిష్టం- సెన్సెక్స్‌@ 40,180

Published Thu, Oct 8 2020 3:57 PM | Last Updated on Thu, Oct 8 2020 3:59 PM

Sensex @40,000-7 months high- IT, Pharma up - Sakshi

దేశీ స్టాక్‌ మార్కెట్లలో ఇటీవల పట్టు బిగించిన బుల్‌ ఆపరేటర్లు మరోసారి తమ హవా చూపారు. దీంతో ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ ఒక్కసారిగా 40,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. ఫలితంగా మార్కెట్లు 7 నెలల గరిష్టాలకు చేరాయి. సెన్సెక్స్‌ 304 పాయింట్లు జంప్‌చేసి 40,183 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 96 పాయింట్లు జమ చేసుకుని 11,835 వద్ద నిలిచింది. తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో వరుసగా ఆరో రోజు మార్కెట్లు హైజంప్‌ చేశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌  40,469 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకగా.. 40,062 వద్ద కనిష్టం నమోదైంది. నిఫ్టీ 11,906-11,791 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులకు లోనైంది. ప్రపంచ మార్కెట్ల జోరు, ప్రభుత్వ ప్యాకేజీపై అంచనాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు వంటి అంశాలు సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.

ఫార్మా అప్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఐటీ 3.25 శాతం, ఫార్మా 2.5 శాతం చొప్పున జంప్‌చేయగా.. బ్యాంకింగ్‌ 1 శాతం రియల్టీ 0.6 శాతం చొప్పున పుంజుకున్నాయి. మీడియా 0.5 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో విప్రో, సిప్లా, టీసీఎస్‌, అల్ట్రాటెక్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, దివీస్‌ ల్యాబ్‌, సన్‌ ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్, టెక్‌ మహీంద్రా,  హీరో మోటో, ఐసీఐసీఐ, హెచ్‌యూఎల్‌ 7.3-1 శాతం మధ్య ఎగశాయి. అయితే గెయిల్‌, ఓఎన్‌జీసీ, ఐటీసీ, ఐషర్‌, ఎల్‌అండ్‌టీ, కోల్‌ ఇండియా, పవర్‌గ్రిడ్‌, ఎస్‌బీఐ లైఫ్‌, ఆర్ఐఎల్‌, బీపీసీఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫిన్‌, ఇండస్‌ఇండ్‌, కొటక్‌ బ్యాంక్‌ 3-0.4 శాతం మధ్య బలహీనపడ్డాయి.

ఐటీ జోరు
డెరివేటివ్‌ కౌంటర్లలో మైండ్‌ట్రీ, కేడిలా, ఐడియా,  బయోకాన్‌, అపోలో హాస్పిటల్స్‌,  కోఫోర్జ్‌, మదర్‌సన్, ఇన్‌ఫ్రాటెల్‌, బీవోబీ, భెల్‌, ఏసీసీ, ఎస్‌ఆర్‌ఎఫ్‌, గ్లెన్‌మార్క్‌ 7.3-2.3 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. వేదాంతా, అదానీ ఎంటర్‌, టాటా కన్జూమర్‌, బాష్‌, ముత్తూట్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, మెక్‌డోవెల్‌, టాటా పవర్‌, టీవీఎస్‌ మోటార్‌, పేజ్‌, చోళమండలం, ఐబీ హౌసింగ్‌ 4.2-1.3 శాతం మధ్య పతనమయ్యాయి. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్స్‌ 0.3 శాతం పుంజుకోగా.. స్మాల్‌ క్యాప్‌ 0.25 శాతం డీలా పడింది. ట్రేడైన షేర్లలో 1,246 షేర్లు లాభపడగా.. 1,436 నష్టాలతో ముగిశాయి.

ఎఫ్‌పీఐల కొనుగోళ్లు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,094 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1,129 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 1,102 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌ రూ. 935 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement