ఫార్మాస్యూటికల్ ప్యాకేజింగ్ రంగంలో అంతర్జాతీయంగా పేరొందిన ఎస్‌జీడీ ఫార్మాతోపాటు మరో దిగ్గజ సంస్థ కార‍్నింగ్ ఇన్‌కార్పొరేటెడ్‌తో భవిష్యత్తు భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ద్వారా ప్రపంచస్థాయి సాంకేతికత, తయారీ నైపుణ్యం తెలంగాణకు అందుతుందని పేర్కొంది. అలాగే కారి్నంగ్ అందించే అత్యున్నత నాణ్యతతో కూడిన ఫార్మాస్యూటికల్ ట్యూబ్ టెక్నాలజీ, ఎస్‌జీడీ ఫార్మా గ్లాస్ వైల్ తయారీ నైపుణ్యాల కలబోతకు ఈ భాగస్వామ్యం దోహదం చేస్తుందని వివరించింది. తద్వారా ఎస్‌జీడీ ఫార్మాస్యూటికల్ సామర్థ్యం ప్రైమరీ ప్యాకేజింగ్ భారత్‌తోపాటు అంతర్జాతీయ వినియోగదారులకు తెలంగాణ నుంచి సరఫరా అవుతుందని ప్రభుత్వం పేర్కొంది.
ప్రైమరీ ప్యాకేజింగ్ రంగంలో కార‍్నింగ్, తెలంగాణ ప్రభుత్వంతో తాము కుదుర్చుకొనే భాగస్వామ్యం ద్వారా ప్రైమరీ ప్యాకేజింగ్ సప‍్లై చైన్‌లో తెలంగాణ పురోగమిస్తుందని ఎస్‌జీడీ ఫార్మా ఎండీ అక్షయ్ సింగ్ వెల్లడించారు. ఈ భాగస్వామ్యం ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలో సుమారు రూ.500 కోట్ల పెట్టుబడి, 150 మందికి శాశ్వత ఉద్యోగాలు, మరో 300 మందికి కాంట్రాక్టు ప్రాతిపదికన 2024 ఆరంభం నాటికి లభిస్తాయి. ఎస్‌జీడీతో తమ భాగస్వామ్యం ద్వారా కీలకమైన ఔషధాల సరఫరా వేగవంతం అవుతుందని కారి్నంగ్ ఇండియా ఎండీ సు«దీర్ పిళ్‌లై అన్నారు. ఫార్చూన్ 500 కంపెనీల జాబితాలో ఉన్న కారి్నంగ్... ఎస్‌జీడీ ఫార్మా భాగస్వామ్యంలో తెలంగాణలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన యూనిట్ ఏర్పడుతుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. తెలంగాణలో ఫార్మాస్యూటికల్ ప్యాకేజింగ్ గ్లాస్ తయారీ ద్వారా లైఫ్ సైన్సెస్ రంగం వృద్ధి శరవేగంగా జరుగుతుందని చెప్పారు. 2030 నాటికి లైఫ్ సైన్సెస్ రంగం విలువ 250 అమెరికన్ డాలర్లకు చేరాలని... తమ భవిష్యత్తు లక్ష్యానికి ఈ భాగస్వామ్యం దోహదం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment