ముంబై, సాక్షి: కరోనా వైరస్ కేసులు దేశీయంగా తగ్గుముఖం పట్టడంతోపాటు.. సాధారణ జీవనానికి ప్రజలు అలవాటు పడుతున్న నేపథ్యంలో ఫార్మా రంగ కౌంటర్లకు డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం కోవిడ్-19కు ముందు స్థాయిలో తిరిగి ఆసుపత్రులు వివిధ ఆరోగ్య సేవలకు తెరతీయడం ప్రభావం చూపుతున్నట్లు హెల్త్‌కేర్ రంగ నిపుణులు పేర్కొన్నారు. హెల్త్‌కేర్ యూనిట్లలో నాన్‌కోవిడ్ విభాగాలకు తిరిగి రోగుల తాకిడి పెరుగుతున్నట్లు కేర్ రేటింగ్స్ తాజా నివేదికలో పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పట్టడం, దేశ విదేశాల నుంచి దేశీ ఫార్మా కంపెనీలకు ఆర్డర్లు లభిస్తుండటం వంటి అంశాలు సైతం ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు తెలియజేశారు. ప్రధానంగా యాంటీవైరల్స్, యాంటీమలేరియా, యాంటీబయోటిక్స్ తదితర విభాగాలలో ఔషధాల విక్రయాలు పెరుగుతున్నట్లు ఫార్మా వర్గాలు పేర్కొన్నాయి. వెరసి ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా ఇండెక్స్ 2 శాతంపైగా బలపడింది. 12,637 పాయింట్ల వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. గత ఐదు రోజులుగా హెల్త్‌కేర్ ఇండెక్స్ ర్యాలీ బాటలో సాగుతుండటం గమనార్హం! ఇతర వివరాలు చూద్దాం..
హైజంప్..
ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా రంగ కౌంటర్లు పలు భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. ఆర్తి డ్రగ్స్ 7 శాతం జంప్‌చేసి రూ. 803ను తాకగా.. ఎఫ్‌డీసీ లిమిటెడ్ 5.5 శాతం ఎగసి రూ. 365కు చేరింది. ఈ బాటలో డిష్‌మ్యాన్ కార్బొజెన్ 8.4 శాతం దూసుకెళ్లి రూ. 158 వద్ద, క్యాప్లిన్ ల్యాబ్ 5.5 శాతం లాభంతో రూ. 520 వద్ద ట్రేడవుతున్నాయి. ఇతర కౌంటర్లలో సింజీన్ ఇంటర్నేషనల్ 7.5 శాతం దూసుకెళ్లి రూ. 615 వద్ద కదులుతోంది. తొలుత రూ. 614ను అధిగమించడం ద్వారా 52 వారాల గరిష్టాన్ని తాకింది. ఇక ఇంట్రాడేలో రూ. 172 వద్ద ఏడాది గరిష్టానికి చేరిన సీక్వెంట్ సైంటిఫిక్ 5 శాతం బలపడి రూ. 168 వద్ద ట్రేడవుతోంది.
ర్యాలీ బాట
ప్రస్తుతం నాట్కో ఫార్మా 5 శాతం ఎగసి రూ. 962 వద్ద కదులుతోంది. తొలుత రూ. 996 వద్ద 52 వారాల గరిష్టాన్ని అందుకుంది. ఇదేవిధంగా గ్లెన్‌మార్క్ ఫార్మా 5.5 శాతం లాభంతో రూ. 531 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 542 వరకూ ఎగసింది. ఇతర దిగ్గజాలలో 3 శాతం లాభంతో సన్ ఫార్మా రూ. 586 వద్ద, డాక్టర్ రెడ్డీస్ 5,55 వద్ద, లుపిన్ రూ. 957 వద్ద కదులుతున్నాయి. బయోకాన్, అరబిందో, ఆల్కెమ్ ల్యాబ్, సిప్లా, టొరంట్ ఫార్మా సైతం 2-1 శాతం మధ్య పుంజుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment