'నేను ఆత్మహత్య చేసుకోను'.. ఫార్మా కంపెనీపై ఉద్యోగి సంచలన వ్యాఖ్యలు | Pfizer Whistleblower Melissa After Boeing Whistleblower Deaths, Tired But Not Suicidal | Sakshi
Sakshi News home page

'నేను ఆత్మహత్య చేసుకోను'.. ఫార్మా కంపెనీపై ఉద్యోగి సంచలన వ్యాఖ్యలు

Published Sun, May 12 2024 3:58 PM | Last Updated on Sun, May 12 2024 6:44 PM

Tired But Not Suicidal Says Melissa McAtee

కరోనా మహమ్మారి ఎంతోమంది ప్రాణాలను హరించింది. ప్రపంచం మొత్తం భయం గుప్పెట్లో ఇరుక్కున్న సమయంలో అనేక ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్స్ తయారుచేసి అందించడం మొదలుపెట్టాయి. ఇలా వ్యాక్సిన్స్ తయారు చేసిన కంపెనీల జాబితాలో ఒకటి ఫార్మా దిగ్గజం 'ఫైజర్'.

కరోనా రక్కసి నుంచి రతప్పించుకోవడానికి ఉపయోగించిన వ్యాక్సిన్స్.. ఆ తరువాత అనేక దుష్ప్రభావాలను చూపించింది. దీంతో చాలామంది కరోనా వ్యాక్సిన్ వేసుకున్నవారు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇటీవల ఫైజర్ ఫార్మా కంపెనీలో పనిచేసే మహిళ 'మెలిస్సా మెక్‌టీ'.. ఆ కంపెనీ గురించి సంచనల విషయాలు బయటపెట్టింది.

అమెరికాకు చెందిన ఫైజర్ ఫార్మా కంపెనీ ప్రపంచంలోని దాదాపు 150 కంటే ఎక్కువ దేశాలకు తన వ్యాక్సిన్ సరఫరా చేసింది. ఈ వ్యాక్సిన్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ గురించి పక్కన పెడితే.. అందులో మానవ పిండం కణజాలం-ఉత్పన్నమైన సెల్ లైన్‌లను ఉపయోగించినట్లు ఆరోపిస్తూ కంపెనీ ఈమెయిల్‌లను మెలిస్సా మెక్‌టీ లీక్ చేశారు.

మెలిస్సా మెక్‌టీ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఇందులో తాను ఫైజర్ విజిల్‌బ్లోయర్‌ని అని పేర్కొంది. కంపెనీలో సుమారు పదేళ్లు పని చేసినట్లు పేర్కొన్నారు. ఈ వీడియో లీక్ చేస్తూ.. తనకు ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశ్యం లేదని, తనకు భర్త, కొడుకు ఉన్నట్లు పేర్కొంది. తన కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేస్తూ.. తన ప్రాణానికి హాని కలిగితే అది, కంపెనీ పనే అంటూ వెల్లడించింది.

గతంలో 737 మ్యాక్స్ బోయింగ్ విమానంలో లోపాలను గురించి వెల్లడించిన వ్యక్తి, కొన్ని రోజుల తరువాత ప్రాణాలు కోల్పోయాడు. కాబట్టి నా ప్రాణాలకు కూడా ప్రమాదం జరిగితే అది కంపెనీ పన్నిన కుట్ర అని మెలిస్సా మెక్‌టీ అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement