స్విట్జర్లాండ్‌కి చెందిన ప్రముక ఫార్మా కంపెనీ ఫెర్రింగ్ హైదరాబాద్‌లో తన కార్యకలపాలు ప్రారంభించింది. జీనోమ్ వ్యాలీలో నిర్మాణం జరుపుకున్న వరల్డ్ క్లాస్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ సెంటర్‌ను తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ 2022 ఏప్రిల్ 25న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఫెర్రింగ్ సంస్థ తొలుత ఈ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ని మహారాష్ట్రలో ప్రారంభించాలని అనుకుందని.. కానీ ఆ తర్వాత హైదరాబాద్‌కి వచ్చినట్టు తెలిపారు.
ఫెర్రింగ్ సంస్థ యాభై ఏళ్లుగా ఫార్మా రంగంలో ఉంది. 60కి పైగా దేశాల్లో ఈ కంపెనీ కార్యకలాపాలు విస్తరించి ఉన్నాయి. రీప్రొడక్టివ్ హెల్త్, మెటర్నల్ హెల్త్, యూరాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాల్లో పని చేస్తోంది. తొలి విడతగా హైదరాబాద్‌లో 30 మిలియన్ యూరోలను పెట్టుబడిగా పెట్టింది.
చదవండి: అమెరికా మార్కెట్ నుంచి సన్ ఫార్మా ఉత్పత్తుల రీకాల్
Comments
Please login to add a commentAdd a comment