‘కోవాక్సిన్​’ తీసుకున్న తొలి వ్యక్తి ఈయనేనా? | Is Bharat Biotech VP took the first dose of covid drug Covaxin | Sakshi
Sakshi News home page

‘కోవాక్సిన్​’ తీసుకున్న తొలి వ్యక్తి ఈయనేనా?

Published Sat, Jul 4 2020 10:23 AM | Last Updated on Sat, Jul 4 2020 4:55 PM

Is Bharat Biotech VP took the first dose of covid drug Covaxin - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత 74వ స్వతంత్ర దినోత్సవం నాటికి కరోనా వైరస్​ అంతుచూసే ‘కోవ్యాక్సిన్​’ను భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌), హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్, పుణేలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీతో(ఎన్‌ఐవీ) కలిసి తేవడానికి కృషి చేస్తోందన్న వార్త మనమందరం విన్నాం. మనుషులపై కోవాక్సిన్​ ప్రయోగానికి ఇటీవలే ఐసీఎంఆర్​, భారత్ బయోటెక్​కు అనుమతి కూడా ఇచ్చింది. ఇదే సమయంలో వ్యాక్సిన్​కు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో హల్​ చల్​ చేస్తోంది. (కరోనా ‘కోవాక్సిన్‌’పై కొత్త గొడవ)

అందులో మెడికల్​ ప్రొటెక్షన్​ గేర్​లో ఉన్న ఓ మహిళ, భారత్​ బయోటెక్​ వైస్​ ప్రెసిడెంట్ వీకే శ్రీనివాస్​కు ఇంజెక్షన్​ ఇస్తోంది. కోవాక్సిన్​ను తొలుత సంస్థ వైస్​ ప్రెసిడెంటే తీసుకున్నారని సదరు ఫొటోకు జోడించిన సారాంశం. దీంతో చాలా మంది ఫేస్​బుక్​, ట్విట్టర్​, వాట్సాప్​లో ఈ ఫొటోను షేర్ చేశారు. దాంతో పాటు ‘తమ ఉత్పత్తిపై నమ్మకం ఉన్న భారత్​ బయోటెక్, తొలుత సంస్థ వైస్​ ప్రెసిడెంట్​కే కోవాక్సిన్​ డోస్​ ఇచ్చింది. భారత్​లో వ్యాక్సిన్​ తీసుకున్న తొలి వ్యక్తి శ్రీనివాసే’ అనే కామెంట్లను జోడించారు. (రికార్డు స్థాయిలో రికవరీ)

కానీ, ఇదో నకిలీ వార్త. స్వయంగా భారత్​ బయోటెకే దీనిపై ట్విట్టర్​లో ఓ ప్రకటన విడుదల చేసింది. ఫొటోలో చూపించినది క్లినికల్​ ట్రయల్​ కాదని వెల్లడించింది. సంస్థ ఉద్యోగులకు రెగ్యులర్​గా నిర్వహిస్తున్న టెస్టుల్లో భాగంగానే శ్రీనివాస్​ నుంచి బ్లడ్​ శాంపిల్​ సేకరించామని చెప్పింది. సోషల్ మీడియాలో సర్క్యూలేట్​ అవుతున్న ఫొటోలు, సమాచారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది.

ఈ నెల 1వ తేదీన భారత్​ బయోటెక్​ ఎండీ కృష్ణ ఓ జాతీయ చానెల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరో పది రోజుల్లో  మనుషులపై ‘కోవాక్సిన్​’ట్రయల్స్​ మొదలవుతాయని చెప్పారు. ఇలా చూసుకున్నా శ్రీనివాసన్ కోవాక్సిన్​ తీసుకున్నారన్న వార్త అబద్ధం అని అర్థం అవుతుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement