కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ కొరతను తగ్గించడం కోసం భారత్ బయోటెక్ కోవాక్సిన్ తయారీని ముంబైకి చెందిన హాఫ్కిన్ బయో ఫార్మాకు కేంద్రం అనుమతి ఇచ్చింది. మహారాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని బయోమెడికల్ సంస్థ హాఫ్కిన్ ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్ నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడానికి కేంద్రం నుంచి అనుమతి కోరింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సహకారంతో భారత్ బయోటెక్ కోవాక్సిన్‌ను అభివృద్ధి చేసింది.
కోవాక్సిన్‌ను ఏడాది వరకు ఉత్పత్తి చేయడానికి హాఫ్‌కైన్‌కు అనుమతి మంజూరు చేసినట్లు బయోటెక్నాలజీ విభాగం మహారాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది. వ్యాక్సిన్ అభివృద్ధి ప్రక్రియలో భాగం కాని మరో ఫార్మా కంపెనీకి సాంకేతిక పరిజ్ఞానం ఇవ్వడం ఇదే మొదటిసారి. కోవిడ్ సురక్ష మిషన్ కింద భారత్ బయోటెక్‌కు రూ.65 కోట్లు కేంద్రంకేటాయించింది. అలాగే, ముంబైకు చెందిన హాఫ్‌కిన్ బయోఫార్మాకు కూడా రూ.65 కోట్లు కేటాయించింది. ఈ చర్య వల్ల వచ్చే నెల నుంచి కోవాగ్జిన్ ఉత్పత్తి సామర్థ్యం 6 రెట్లు పెరగనుంది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment