న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభిస్తోన్న వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాన వైద్య సలహాదారు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ కట్టడికి భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేస్తున్న కరోనా టీకా కోవాగ్జిన్ సమర్థవంతంగా చెక్ పెడుతున్నట్లు తాము గుర్తించామని వెల్లడించారు. మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ మీడియాతో మాట్లాడిన ఆయన సెకండ్ వేవ్ కట్టడికి కోవాగ్జిన్ బాగా పనిచేస్తుందని.. ఈ విషయాన్ని భారత్‌లో నమోదవుతున్న రోజూవారి డాటా ఆధారంగా తాము గుర్తించినట్లు ఆంథోనీ ఫౌసీ తెలిపారు.
‘‘ఇండియాలో రోజూ కరోనా సోకుతున్న వారి డాటాను పరిశీలిస్తున్నాం. అయితే కోవాగ్జిన్ కారణంగా ఇటీవల కేసుల సంఖ్య స్థిరంగా ఉన్నట్లు గుర్తించాం. సెకండ్ వేవ్‌కు చెక్ పెట్టాలంటే వ్యాక్సిన్లు తప్పని సరిగా వేయించుకోవాలి’’ అని ఆంథోనీ ఫౌసీ చెప్పినట్లు పీటీఐ తన కథనంలో పేర్కొంది.
బీ.1.617 వేరియంట్‌లో మూడు కొత్త స్పైక్ ప్రోటీన‍్లు
మహారాష్ట్ర, ఢిల్లీలలో నమోదైన కరోనా కేసుల్లో కనిపించే బీ.1.617 వేరియంట్‌లో మూడు కొత్త స్పైక్ ప్రోటీన్లు ఉన్నట్లు తేలింది. కాబట్టే దేశంలో సెకండ్ వేవ్ విరుచుకుపడుతుంది. అయితే కోవాగ్జిన్‌ను వినియోగించడం ద్వారా ఇమ్యూనిటీ పవర్ పెరిగి, కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా ప్రతిరోధకాలను తయారు చేస్తుంది. ఆ ప్రతిరోధకాలు శరీర కణాజాలంలో ఎక్కడో ఓ చోట దాక్కున్న వైరస్‌ని గుర్తించి, దాన్ని నాశనం చేస్తుంది అని నిపుణులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ బీ.1.617 వేరియంట్‌ని 17 దేశాలలో గుర్తించినట్లు అమెరికా హెల్త్ ఏజెన్సీ తెలిపింది. కాగా భారత్, యూకే, యూఎస్, సింగపూర్‌లలో ఈ వేరియంట్ కేసులు ఎక్కువగా ఉన‍్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ తన అధికారిక వెబ్ సైట్‌లో పొందుపరిచింది.
భారత్ బయోటెక్ - ఐసీఎంఆర్ భాగస్వామ్యంలో తయారీ
భారత్ బయోటెక్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) భాగస్వామ్యంతో కోవ్యాక్సిన్ తయారైంది. ఈ వ్యాక్సిన్‌ను క్లినికల్ ట్రయల్‌లో ఉన్నప్పుడు అత్యవసర వినియోగం కోసం కేంద్రం జనవరి 3 న ఆమోదించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment