
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిన్న ప్రధానికి రాసిన లేఖపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘సీఎం జగన్ కోవాగ్జిన్ పేటెంట్ ఫార్ములాని అందరికి ఇవ్వాలన్నారు. దాని వల్ల వాక్సిన్ త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావచ్చు.. ఈ ముప్పు నుంచి కాపాడవచ్చిన సీఎం జగన్, మోదీకి లేఖ రాశారు. కానీ చంద్రబాబు మాత్రం భారత్ బయోటెక్ ఏ విధంగా పెటేంట్ వదులుకుంటుందని ప్రశ్నిస్తూ.. ఆ కంపెనీకి బ్రోకర్‌లా వ్యవహరిస్తున్నారు. ఆ కంపెనీ మీ బంధువుది అయినంత మాత్రాన ఇవ్వకూడదా’’ అని జోగి రమేష్ ప్రశ్నించారు.
‘‘పెన్సిలిన్ లాంటి సుబ్బామిసైన్ అనే ఔషదాన్ని తయారు చేసిన ఎల్లాప్రగడ సుబ్బారావు వ్యాపారం చేయలేదు. కేంద్రం ప్రభుత్వ ఆధీనంలోనే మెడిసిన్, ఆక్సీజన్, వాక్సిన్ అంతా ఉంది. ప్రజలు చనిపోతుంటే చంద్రబాబు పైశాచిక ఆనందం పొందుతున్నారు. బీజేపీ వాళ్లకు వాక్సిన్ కేంద్రం పరిధిలో ఉందని తెలియదా. సీఎం జగన్ మనసుపెట్టి విశాల హృదయంతో అందరికీ వాక్సిన్ ఇవ్వాలని తాపత్రయం పడుతున్నారు. కానీ చంద్రబాబు మాత్రం నా బంధువులకు సంబంధించిన భారత్ బయోటెక్‌కే పేటెంట్ ఉండాలని ఆలోచిస్తున్నాడు. ప్రజలు ఈ తేడాని గుర్తించాలి. ఎంతమంది మరణిస్తున్నా వాళ్లకు పేటెంటే’’ ముఖ్యం అంటూ జోగి రమేష్ విరుచుకుపడ్డారు.
‘‘చంద్రబాబు నువ్వేమన్నా శాస్త్రవేత్తవా.. ఎన్440కే వైరస్ అక్కడ పుట్టింది.. ఇక్కడ పుట్టింది అని చెప్పడానికి. కోవిడ్ ఉంది కదా అని మేము.. నువ్వు, నీ కోడుకు లోకేష్‌లా ఇళ్లలో పడుకోవట్లేదు. మా ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం కోవిడ్ రోగుల వద్దకు వెళుతున్నారు. మేము కేవలం జూమ్ మీటింగులకు, ట్విట్టర్‌కే పరిమితం కాలేదు’’ అని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment