కోవాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐవీఎంఏ) అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఆయన ఈ పదవిలో రెండేళ్లు కొనసాగనున్నారు.
ఈ పదవిలో ఇప్పటి వరకు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ అదార్ పూనావాలా ఉన్నారు. ఐవీఎంఏ ఉపాధ్యక్షురాలిగా బయోలాజికల్ ఇ.లిమిటెడ్ ఎండీ మహిమా దాట్ల, కోశాధికారిగా భారత్ బయోటెక్ సీఎఫ్‌ఓ టి.శ్రీనివాస్‌లను ఎన్నుకున్నారు. ఐవీఎంఏ డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ హర్షవర్థన్ కొనసాగుతారు.
ఇదీ చదవండి: ఏఐ టూల్స్ తయారీ సంస్థల్లో పెట్టుబడి పెంచనున్న ప్రముఖ సంస్థ
అందరికీ అవసరమయ్యే టీకాలు అందించడమే ఐవీఎంఏ ప్రధాన లక్ష్యమని డాక్టర్ కృష్ణ ఎల్ల పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ యూఎస్‌ఎఫ్‌డీఏ ప్రమాణాలకు అనుగుణంగా దేశంలో టీకాల తయారీ సంస్థలు సిద్ధం కావాలన్నారు. ఆఫ్రికా వంటి దేశాలకు టీకా అవసరాలు అధిమన్నారు. టీకా తయారీలో వస్తున్న అంకుర సంస్థలకు సరైన ప్రోత్సాహకాలు అందించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment