
ప్రజారోగ్య రంగంలో చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఇచ్చే జాన్స్ హాప్‌కిన్స్ బ్లూమ్‌బెర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డీన్ పతకాన్ని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డా.కృష్ణ ఎల్లా అందుకున్నారు. మే 22, 2024న యూఎస్‌లోని మేరీల్యాండ్ బాల్టిమోర్‌లో జరిగిన బ్లూమ్‌బెర్గ్ స్కూల్ కాన్వొకేషన్ వేడుకలో డీన్ ఎల్లెన్ జే.మెకెంజీ చేతుల మీదుగా ఈ అవార్డును తీసుకున్నారు.
కృష్ణఎల్లా ప్రజారోగ్యానికి చేసిన కృషిని గుర్తించి ఈ పథకానికి ఎంపిక చేసినట్లు నిర్వాహకులు చెప్పారు. కరోనా సమయంలో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసి కొవిడ్ తీవ్రతను తగ్గించారని తెలిపారు. ఈ పతకం అందుకున్న సందర్భంగా కృష్ణ ఎల్లా మాట్లాడుతూ..‘ప్రపంచవ్యాప్తంగా సైన్స్ అండ్ రిసెర్చ్‌లో ఎన్నో విజయాలు సాధించిన భారత్‌కు ఈ పతకాన్ని అంకితం ఇస్తున్నాను. ఈ పతకం మా శాస్త్రవేత్తల బృందానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. మోనోక్లోనల్ యాంటీబాడీల అభివృద్ధి కోసం భారత్‌బయోటెక్ ఎన్నో పరిశోధనలు చేసి వ్యాక్సిన్‌ను కనుగొంది’ అన్నారు.
ఇదీ చదవండి: 6.8లక్షల మొబైల్ నంబర్లను ధ్రువీకరించాలన్నటెలికాంశాఖ
డాక్టర్ ఎల్లా నేతృత్వంలో భారత్ బయోటెక్ 220 పేటెంట్లు, 20 వ్యాక్సిన్‌లు, బయో థెరప్యూటిక్స్ కలిగి ఉందని కంపెనీ చెప్పింది. 125 దేశాల్లో 9 బిలియన్ వ్యాక్సిన్ డోస్‌లను పంపిణీ చేసినట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment