డాక్టర్ కృష్ణ ఎల్ల(ఫైల్ ఫొటో)
న్యూఢిల్లీ: భారత్‌లో మూడు వేవ్‌లుగా విజృంభించిన కరోనా వైరస్.. ఐదు లక్షల మందికి పైగా బలి తీసుకుంది. అంతకు మించి లాక్‌డౌన్, ఇతర పరిస్థితుల్లో లెక్కలేనన్ని కుటుంబాలను ఆర్థికంగా ఛిన్నాభిన్నం చేసేసింది. ప్రస్తుతం కరోనా పుట్టిల్లుగా భావిస్తున్న చైనాలో కొత్తగా కేసులు నమోదు అవుతున్నాయి. మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో భారత్ జాగ్రత్తపడుతోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కూడా.
అయితే ఫోర్త్ వేవ్‌కి భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్ల. ఢిల్లీలో పోలియోపై ప్రముఖ వైరాలజిస్ట్ ప్రొఫెసర్ జాకబ్ జాన్ రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోర్త్ వేవ్ గురించి భయపడాల్సిందేమీ లేదన్న ఆయన.. కరోనా విజృంభించినా బెదిరిపోవాల్సిన అవసరం లేదన్నారు. అంతేకాదు భవిష్యత్తులో లాక్‌డౌన్‌ల అవసరం ఉండకపోవచ్చని అభిప్రాయపడిన కృష్ణ ఎల్ల.. కరోనా విజృంభించిన తట్టుకునే సామర్థ్యం ఉందని చెప్తున్నారు.
అంతేకాదు వ్యాక్సినేషన్‌లో భాగంగా.. మూడు డోసులు వేయించుకుంటేనే ఉపయోగం ఉండొచ్చని చెప్తున్నారాయన. ఫోర్త్ వేవ్ ప్రభావం అంతగా ఏమీ ఉండనిచెప్పిన ఆయన.. ఇప్పటికే దేశమంతా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. మూడో డోసు(బూస్టర్ డోసు) వ్యాక్సిన్ వేసుకోవడమే కాకుండా మాస్కులు కొనసాగించడం, శానిటైజర్ వాడడం కొనసాగించాలని ప్రజలకు సూచించారు ఆయన.
Comments
Please login to add a commentAdd a comment