హైదరాబాద్‌కు 64 దేశాల రాయబారుల బృందం | Covid Vaccine: 64 Foreign Delegation Reached To Hyderabad | Sakshi
Sakshi News home page

కోవిడ్‌ వ్యాక్సిన్‌పై చర్చించనున్న విదేశీ రాయబారులు

Published Wed, Dec 9 2020 12:06 PM | Last Updated on Wed, Dec 9 2020 1:08 PM

Covid Vaccine: 64 Foreign Delegation Reached To Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కట్టడికి కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ అభివృద్ధి చేస్తున్న పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను పరిశీలించేందుకు 64 దేశాల రాయబారులు బృందం హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఈ బృందంలో పలు దేశాల హైకమిషనర్‌లు కూడా ఉన్నారు. వీరు ఎయిర్‌పోర్టు నుంచి శామీర్‌పేటలోని జీనోమ్‌ వ్యాలీకి మరికాసేపట్లో చేరుకోనున్నారు. ఈ హైకమిషనర్‌, రాయబారుల బృందం రెండు గ్రూపులుగా విడిపోయి కోవిడ్ 19 వ్యాక్సిన్‌పై పనిచేస్తున్న భారత్ బయోటెక్ లిమిటెడ్, ఈ బయోలాజికల్స్ లిమిటెడ్‌ సంస్థలను సందర్శించి వ్యాక్సిన్‌పై చర్చించన్నారు. ఈ నేపథ్యంలో టీకాల పురోగతిని పరిశీలించి అనంతరం ఈ విదేశీ బృందం శాస్త్రవేత్తలతో భేటీ కానుంది.

ఇక సమావేశం ముగిసిన తర్వాత సాయంత్ర 5:50 గంటలకు అంబాసిడర్‌, హైకమిషనర్‌లు తిరిగి ఢిల్లీకి బయల్దేరనున్నారు. విదేశి పత్రినిధుల పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్టు వద్ద భద్రత ఏర్పాట్లు చేసింది. భారత్‌ బయోటెక్‌ అభివృద్ది చేస్తున్న కొవాగ్జిన్‌ టీకా ప్రస్తుతం మూడోదశ ట్రయల్స్‌లో ఉన్న విషయం తెలిసిందే. బయోలాజికల్‌ ఈ-సంస్థ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ ఫేజ్‌-1, ఫేజ్‌-2 క్లినికల్‌ ట్రయల్స్‌కు కేంద్ర గత నెలలలో అనుమతిచ్చింది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా హైదరాబాద్‌కు వచ్చి భారత్‌ బయోటెక్‌ను సందర్శించిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement