Foreign delegation
-
ఆంధ్రప్రదేశ్‌లో సమృద్ధిగా వనరులు
దొండపర్తి (విశాఖ దక్షిణ): ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన వనరులు సమృద్ధిగా ఉన్నాయని పరిశ్రమల శాఖ, ఆంధ్రప్రదేశ్ మారిటైం బోర్డు అధికారులు విదేశీ ప్రతినిధులకు వివరించారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో భాగంగా శుక్రవారం మ.3 గంటలు తరువాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్ దేశాల ప్రతినిధులతో ప్రత్యేక సెషన్ నిర్వహించారు. ఇందులో పరిశ్రమలు, మారిటైం బోర్డు అధికారులు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, ఇక్కడ వర్క్‌ఫోర్స్, ప్రభుత్వం అందిస్తున్న సహకారం, ప్రోత్సాహకాలను వారికి విశదీకరించారు. ముఖ్యంగా దేశంలోనే రెండో అతిపెద్ద తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లో ఉందని.. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మూడు పోర్టులను సైతం నిర్మిస్తోందని వివరించారు. అలాగే, నెదర్లాండ్స్‌లో పోర్టుల నిర్మాణాలు, వాటి నిర్వహణకు గల అవకాశాలను ఆ దేశ ప్రతినిధులు ఇక్కడి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌తో పాటు అదాని, ఇతర ప్రైవేటు సంస్థ ప్రతినిధులకు వివరించారు. దీనిపై త్వరలోనే పూర్తిస్థాయిలో సమీక్ష జరిపి వ్యాపార అవకాశాలపై నిర్ణయం తీసుకుంటామని నెదర్లాండ్స్ ప్రతినిధులు తెలిపారు. -
హైదరాబాద్‌కు 64 దేశాల రాయబారుల బృందం
సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడికి కోవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను పరిశీలించేందుకు 64 దేశాల రాయబారులు బృందం హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఈ బృందంలో పలు దేశాల హైకమిషనర్లు కూడా ఉన్నారు. వీరు ఎయిర్‌పోర్టు నుంచి శామీర్‌పేటలోని జీనోమ్ వ్యాలీకి మరికాసేపట్లో చేరుకోనున్నారు. ఈ హైకమిషనర్, రాయబారుల బృందం రెండు గ్రూపులుగా విడిపోయి కోవిడ్ 19 వ్యాక్సిన్‌పై పనిచేస్తున్న భారత్ బయోటెక్ లిమిటెడ్, ఈ బయోలాజికల్స్ లిమిటెడ్ సంస్థలను సందర్శించి వ్యాక్సిన్‌పై చర్చించన్నారు. ఈ నేపథ్యంలో టీకాల పురోగతిని పరిశీలించి అనంతరం ఈ విదేశీ బృందం శాస్త్రవేత్తలతో భేటీ కానుంది. ఇక సమావేశం ముగిసిన తర్వాత సాయంత్ర 5:50 గంటలకు అంబాసిడర్, హైకమిషనర్లు తిరిగి ఢిల్లీకి బయల్దేరనున్నారు. విదేశి పత్రినిధుల పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్టు వద్ద భద్రత ఏర్పాట్లు చేసింది. భారత్ బయోటెక్ అభివృద్ది చేస్తున్న కొవాగ్జిన్ టీకా ప్రస్తుతం మూడోదశ ట్రయల్స్‌లో ఉన్న విషయం తెలిసిందే. బయోలాజికల్ ఈ-సంస్థ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ఫేజ్-1, ఫేజ్-2 క్లినికల్ ట్రయల్స్‌కు కేంద్ర గత నెలలలో అనుమతిచ్చింది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా హైదరాబాద్‌కు వచ్చి భారత్ బయోటెక్‌ను సందర్శించిన విషయం తెలిసిందే. -
కోవిడ్ వ్యాక్సిన్‌పై చర్చించనున్న విదేశీ రాయబారులు
-
తెలంగాణ ఆచారాలు అదుర్స్
తెలంగాణ ఆచార వ్యవహారాలు సూపర్బ్‌గా ఉన్నాయని, పోచంపల్లి పర్యటన మంచి అనుభూతినిచ్చిందని విదేశీ ప్రతినిధుల బృందం కొనియాడింది. హైదరాబాద్‌లో జరుగుతున్న 12వ ‘ప్రపంచ మహిళా కాంగ్రెస్’ అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లో పాల్గొనడానికి 10 దేశాల నుంచి వచ్చిన 25 మంది శుక్రవారం గ్రామీణ ప్రజల జీవన విధానాలు, చేతి వృత్తులను పరిశీలించడానికి పోచంపల్లిని సందర్శించారు. స్థానిక గ్రామీణ పర్యాటక కేంద్రంలో వీరికి తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు భూదానోద్యమ చరిత్ర ఫొటో గ్యాలరీ, చేనేత వస్త్రాల స్టాల్స్‌ను తిలకించారు. చేనేత కార్మికుల గృహాల కు వెళ్లి నూలు, రంగులద్దకం, చిటికి కట్టడం వంటి వస్త్ర తయారీ ప్రక్రియలను పరిశీలించారు. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాల డిజైన్లు చూసి అబ్బురపడి కొనుగోలు చేశారు. అనంతరం తెలంగాణ గ్రామీణ వంటకాలనూ రుచి చూశారు. గిరిజన యువతులతో కలిసి నృత్యాలు చేశారు. వీరికి టూర్ ఆర్గనైజర్ సుప్రియ బాలిరావు మార్గదర్శకం చేశారు. - భూదాన్‌పోచంపల్లి ప్రజల ఆదరాభిమానాలు మరువలేనివి ఇక్కడి ప్రజలు ఎంతో స్నేహ పూర్వకంగా ఉన్నారు. వారు చూపించిన ఆదరాభిమానాలు మరువలేనివి. ప్రపంచ దేశాలలో ఇప్పుడిప్పుడే మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. మా దేశ అధ్యక్షురాలైన డిల్మరూసా కూడా ఓ మహిళనే. బ్రెజిల్లో స్త్రీల అక్షరాస్యత 60శాతం ఉంది. క్రి కెట్ కంటే సాకర్, అథ్లెటిక్స్ ఆటలకు ప్రోత్సహాం ఉంటుంది. - సెంటియర్, బ్రెజిల్ అభివృద్ధిలో ఇండియా ముందుంది అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇండియా ముందుంది. ఇక్కడి మహిళలు కుటుంబ బాధ్యతను సమష్టిగా పంచుకోవడం గొప్ప విషయం. ప్రజల ఆచారాలు, సంప్రదాయాలు ఎంతగానో ఆకట్టుకొన్నాయి. ప్రాచీనమైన చేనేత కళను పరిర క్షించుకోవాలి. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు బాగున్నాయి. - మిల్లిహట్టన్, కెనడా