
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్ బయోటెక్ పర్యటన ముగిసింది. మూడు నగరాల పర్యటనలో భాగంగా శనివారం హైదరాబాద్‌కు వచ్చని ఆయన నేరుగా భారత్ బయెటెక్‌కి వెళ్లారు. కరోనా వ్యాక్సిన్ పురోగతిపై శాస్త్రవేత్తలతో ప్రధాని సమీక్షించారు. వాక్సిన్ తయారీ కోసం అహర్నిహలు శ్రమిస్తున్న శాస్త్రవేత్తలతో మోదీ సమీక్షించారు. వ్యాక్సిన్ తయారీపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సిన్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్న భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలుపుతూ మోదీ ట్వీట్ చేశారు. ఈ సంస్థ కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీని వేగవంతం చేసేందుకు ఐసీఎంఆర్‌తో కలిసి పని చేస్తోందన్నారు. కోవిడ్-19 నిరోధానికి స్వదేశీ వ్యాక్సిన్ తయారీలో సాధించిన పురోగతిని శాస్త్రవేత్తలు తనకు వివరించారని తెలిపారు.
శనివారం ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరిన మోదీ.. నేరుగా గుజరాత్‌లోని అహ్మదాబాద్ చేరుకున్నారు. అక్కడి జైడస్ బయోటెక్ పార్క్ సందర్శించారు. ఈ కార్యక్రమం అనంతరం అహ్మదాబాద్ నుంచి నేరుగా హైదరాబాద్ పయనమయ్యారు. హైదరాబాద్ పర్యటన అనంతరం పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్‌కు చేరుకుంటారు. (ప్రధాని మోదీ రాక; కేసీఆర్ అవసరం లేదు)