
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్‌ను నిరోధించేందుకు దేశీయంగా కోవాగ్జిన్ టీకా అభివృద్ధి చేస్తున్న భారత్ బయోటెక్ గురువారం కీలక ప్రకటన చేసింది. మూడవ దశ ట్రయల్స్‌కు సంబంధించిన వాలంటీర్ల ఎంపిక పూర్తయిందని తెలిపింది. కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి ఆమోదంపై తీవ్ర చర్చ మధ్య భారత్ బయోటెక్ తమ కోవిడ్-19 వ్యాక్సిన్ ట్రయల్స్ కోసం 25,800 మంది నియామకాలను పూర్తి చేసినట్లు తెలిపింది.
ట్రయల్స్ నిమిత‍్తం 23,000 మంది వాలంటీర్లను నియమించినట్లు జనవరి 2 న కంపెనీ సమాచారం ఇచ్చింది. ఈ పరీక్షల డేటా మార్చిలో వెలువడనున్నాయని అంచనా వేయడంతోపాటు, ఇప్పటికే 5000 మందికి పైగా టీకా రెండు షాట్లను అందించినట్టు తెలిపింది. క్లినికల్ ట్రయల్ మోడ్‌లో కోవాగ్జిన్ పరిమిత వినియోగానికి సబ్జెక్ట్ నిపుణుల కమిటీ (ఎస్‌ఇసి) జనవరి 2 న సిఫారసు చేసింది. అనంతరం డ్రగ్ రెగ్యులేటరీ కూడా ఆమోదం తెలిపింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ,నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవి) సహకారంతో భారత్ బయోటెక్ ఈ టీకాను అభివృద్ది చేస్తున్న సంగతి తెలిసిందే.
— suchitra ella (@SuchitraElla) January 7, 2021