
ఐక్యరాజ్యసవిుతి/జెనీవా: కోవిడ్–19 నియంత్రణ కోసం హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ పేరిట టీకాను అభివృద్ధి చేసింది. ఈ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)కు ఏప్రిల్ 19న దరఖాస్తు చేసుకుంది.
అయితే, అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చే విషయంలో తొందరపడలేమని, కోవాగ్జిన్‌పై భారత్ బయోటెక్ నుంచి అదనపు సమాచారం ఆశిస్తున్నామని డబ్ల్యూహెచ్‌ఓ సోమవారం స్పష్టం చేసింది. కోవాగ్జిన్ టీకా భద్రత, ప్రభావశీలతను క్షుణ్నంగా పరిశీలించాల్సి ఉందని ట్విట్టర్లో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment