
బెంటేగా వీ8 ఎస్‌యూవీ
సాక్షి, న్యూఢిల్లీ: ఐకానిక్ బ్రిటీష్ కార్ల తయారీ సంస్థ బెంట్లీ మరో ఖరీదైన కారును లాంచ్ చేసింది. బెంటేగా సిరీస్‌లో ప్రీమియం లగ్జరీ ఎస్‌యూవీ రేంజ్‌లో దీన్ని విడుదల చేసింది. ‘వి8’ పేరుతో అత్యంత శక్తివంతమైన వెర్షన్‌ను దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టింది. వెయ్యి కిలోమీటర్ల రేంజ్ ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యంతో వీ8, త్వరలోనే రానున్న వీ8 హైబ్రీడ్ కార్లు ప్రపంచంలోనే మొట్టమొదటి అతి ఖరీదైన ఎస్‌యూవీ అని కంపెనీ చెబుతోంది. దీని ధర రూ.3.78 కోట్లు(ఎక్స్ షోరూం, ముంబై).
ఎక్స్‌క్లూజివ్ మోటార్స్ భాగస్వామ్యంతో బెంట్లే ఈకారును అందుబాటులోకి తెచ్చింది. బెంటేగా రేంజ్‌లోని ఇతర మోడళ్లతో పోలిస్తే వి8 ఎక్స్‌టీరియర్‌కు అదనపు ఫీచర్లను జోడించినట్లు ఎక్స్‌క్లూజివ్ మోటార్స్ ఎండీ సత్య బాగ్లా తెలిపారు. ఈ లగ్జరీ ఎస్‌యూవి కేవలం 4.5 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. గంటకు గరిష్ఠంగా 290 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. లీటరుకు సుమారు 9 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ ఫైవ్ సీటీర్ ఎస్‌యూవీలో 4 లీటర్ ట్విన్ టర్బో ఛార్జ్‌డ్ వి8 పెట్రోల్ ఇంజిన్, 8 స్పీడ్ ఆటోమేషన్ ట్రాన్స్‌మిషన్ సిస్టం 542 బిహెచ్‌పిపవర్, 60జీబీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, 10 స్పీకర్లు ప్రధానఫీచర్లుగా ఉన్నాయి. ఇక పోటీ విషయానికి వస్తే త్వరలో విడుదల కానున్న ఖరీదైన కార్లు రేంజ్ రోవర్ ఎస్‌యూవీ ఆటోబయోగ్రఫీ ఫేస్‌లిఫ్ట్, రోల్స్‌రాయిస్ కులినాస్కి పెద్దపోటీ ఇవ్వనుందని అంచనా.
కాగా భారత మార్కెట్లో సంస్థ ఇప్పటికే బెంట్లీ బెంటేగా కాంటినెంటల్ జిటి, ఫ్లయింగ్ స్పర్ మోడళ్లను విక్రయిస్తోంది. ఇండియాలో ఫెరారీ, మాసెరాటీ అతివిలాసవంతమైనకార్ల విక్రయాలు క్రయంగా పుంజుకుంటున్నాయి. 2014లో 14, 900 యూనిట్లు అమ్ముడు బోయాయట. బెంటేగా, మాసెరాటీ లెవాంటే ఎంట్రీ తరువాత ఈ అమ్మకాలు మరింత పుంజుకుని 2016లో 26,750యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ సంఖ‍్య 2020 నాటికి 40వేలకు చేరవచ్చని అంచనా.





Comments
Please login to add a commentAdd a comment