bentayga
-
బెంట్లీ లగ్జరీ కారు నయా వర్షన్.. రేటు ఎంతంటే?
న్యూఢిల్లీ: బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ బెంట్లీ మోటార్స్ మంగళవారం దేశీయ మార్కెట్లోకి బెంటేగా కొత్త వెర్షన్ రిలీజ్ చేసింది. బెంట్లీ నుంచి వచ్చిన మొదటి సూపర్ యూటిలిటీ వెహికల్ (ఎస్యూవీ) బెంటెగా కావడం విశేషం. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి బెంట్లీ లగ్జరీ ఎస్యూవీ కారు. 2015లో ఈ కారును లాంచ్ చేయగా, ప్రస్తుతం ఈ బెంటేగా ఎస్యూవీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూమ్ (ఢిల్లీ) ధర రూ .4.10 కోట్లుగా కంపెనీ నిర్ణయించింది. బెంట్లీ కంపెనీ న్యూ బియాండ్ 100 బిజినెస్ స్ట్రాటజీలో భాగంగా రూపొందించారు. ఈ ఎస్యూవీ 4.0-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ వి8 పెట్రోల్ ఇంజిన్‌తో రానుంది. 10.9 అంగుళాల స్క్రీన్, సూపర్-హై-రిజల్యూషన్ గ్రాఫిక్స్ కలిగిన నెక్స్ట్ జనరేషన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తో పాటు హైకనెక్టివిటీతో పనిచేస్తుందని ఒక ప్రకటనలో కంపెనీ తెలిపింది. కొత్త బెంటేగా వర్షన్‌ను భారతీయ కస్టమర్లకు ముందుకు తీసుకురావటం సంతోషంగా ఉందని అధికారిక బెంట్లీ మోటార్స్ డీలర్షిప్ ఎక్స్‌క్లూజివ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ బాగ్లా తెలిపారు. బెంట్లీ 100 సంవత్సరాలకు పైగా ఆటోమోటివ్ లగ్జరీ కార్ల ఉత్పత్తిలో ముందంజలో ఉంది. ఈ సరికొత్త డిజైన్‌తో వెనుక భాగం లెగ్‌రూమ్ ఎక్కువగా పెరిగింది. ఫ్రంట్ అండ్ రియర్ కొత్త డిజైన్లు బెంట్లీ డీఎన్ఎను కొనసాగిస్తోంది. కొత్త బెంటెగాలో ఎంబెడెడ్ సిమ్‌ను ఉపయోగించడంతో మై బెంట్లీ కనెక్ట్ సేవలను ఈజీగా పొందవచ్చు. అలాగే పాత వర్షన్లో ఉన్న వైర్లెస్ ఆపిల్‌తో పాటుగా ఆండ్రాయిడ్ ఆటోతో కూడా రానుంది. (చదవండి: ఆల్న్యూ క్రెటా అమ్మకాల జోరు) -
అతి ఖరీదైన కారు ఇదే..!
సాక్షి, న్యూఢిల్లీ: ఐకానిక్ బ్రిటీష్ కార్ల తయారీ సంస్థ బెంట్లీ మరో ఖరీదైన కారును లాంచ్ చేసింది. బెంటేగా సిరీస్‌లో ప్రీమియం లగ్జరీ ఎస్యూవీ రేంజ్లో దీన్ని విడుదల చేసింది. ‘వి8’ పేరుతో అత్యంత శక్తివంతమైన వెర్షన్‌ను దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టింది. వెయ్యి కిలోమీటర్ల రేంజ్ ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యంతో వీ8, త్వరలోనే రానున్న వీ8 హైబ్రీడ్ కార్లు ప్రపంచంలోనే మొట్టమొదటి అతి ఖరీదైన ఎస్యూవీ అని కంపెనీ చెబుతోంది. దీని ధర రూ.3.78 కోట్లు(ఎక్స్ షోరూం, ముంబై). ఎక్స్‌క్లూజివ్ మోటార్స్ భాగస్వామ్యంతో బెంట్లే ఈకారును అందుబాటులోకి తెచ్చింది. బెంటేగా రేంజ్‌లోని ఇతర మోడళ్లతో పోలిస్తే వి8 ఎక్స్టీరియర్కు అదనపు ఫీచర్లను జోడించినట్లు ఎక్స్‌క్లూజివ్ మోటార్స్ ఎండీ సత్య బాగ్లా తెలిపారు. ఈ లగ్జరీ ఎస్యూవి కేవలం 4.5 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. గంటకు గరిష్ఠంగా 290 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. లీటరుకు సుమారు 9 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ ఫైవ్ సీటీర్ ఎస్‌యూవీలో 4 లీటర్ ట్విన్ టర్బో ఛార్జ్డ్ వి8 పెట్రోల్ ఇంజిన్, 8 స్పీడ్ ఆటోమేషన్ ట్రాన్స్మిషన్ సిస్టం 542 బిహెచ్పిపవర్, 60జీబీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, 10 స్పీకర్లు ప్రధానఫీచర్లుగా ఉన్నాయి. ఇక పోటీ విషయానికి వస్తే త్వరలో విడుదల కానున్న ఖరీదైన కార్లు రేంజ్ రోవర్ ఎస్యూవీ ఆటోబయోగ్రఫీ ఫేస్‌లిఫ్ట్, రోల్స్‌రాయిస్ కులినాస్కి పెద్దపోటీ ఇవ్వనుందని అంచనా. కాగా భారత మార్కెట్లో సంస్థ ఇప్పటికే బెంట్లీ బెంటేగా కాంటినెంటల్ జిటి, ఫ్లయింగ్ స్పర్ మోడళ్లను విక్రయిస్తోంది. ఇండియాలో ఫెరారీ, మాసెరాటీ అతివిలాసవంతమైనకార్ల విక్రయాలు క్రయంగా పుంజుకుంటున్నాయి. 2014లో 14, 900 యూనిట్లు అమ్ముడు బోయాయట. బెంటేగా, మాసెరాటీ లెవాంటే ఎంట్రీ తరువాత ఈ అమ్మకాలు మరింత పుంజుకుని 2016లో 26,750యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ సంఖ్య 2020 నాటికి 40వేలకు చేరవచ్చని అంచనా. -
బెంట్లీ తొలి ఎస్యూవీ ‘బెంటేగ’
ధర రూ.3.85 కోట్లు న్యూఢిల్లీ: అల్ట్రా లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బెంట్లీ తాజాగా తన తొలి స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం ‘బెంటేగ’ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.3.85 కోట్లు (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ). ఎక్స్‌క్లూజివ్ మోటార్స్.. బెంట్లీ కంపెనీకి భారత్‌లోని డీలర్‌గా వ్యవహరిస్తోంది. ‘ఇప్పటికే బెంటేగ బుకింగ్స్‌ను తీసుకున్నాం. తొలి డెలివరీ 2 వారాల్లో జరుగుతుందని’ ఎక్స్‌క్లూజివ్ మోటార్స్ ఎండీ సత్య బంగ్లా తెలిపారు. వినియోగదారులు ఆర్డర్ ఇచ్చిన 5-6 నెలల కాలంలో కారును డెలివరీ చేస్తామని పేర్కొన్నారు. ఎస్యూవీ ప్రత్యేకతలు: ‘బెంటేగ’లో ట్విన్ టర్బో చార్జ్డ్ 6 లీటర్ వీ12 పెట్రోల్ ఇంజిన్, 8 స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్, వాయిస్ కంట్రోల్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, నావిగేషన్ వ్యవస్థ వంటి తదితర ప్రత్యేకతలున్నాయి. ప్రపంచంలో ఇదే అత్యంత వేగవంతమైన లగ్జరీ ఎస్యూవీ అని కంపెనీ పేర్కొంది. దీని టాప్ స్పీడ్ గంటకు 301 కిలోమీటర్లు. హైదరాబాద్‌లో కొత్త షోరూమ్ హైదరాబాద్‌లో కొత్తగా బెంట్లీ షోరూమ్‌ను నిర్మిస్తున్నామని బంగ్లా తెలిపారు. దీన్ని రెండు నెలల్లో ప్రారంభిస్తామన్నారు. ఈ షోరూమ్‌లో సర్వీస్ సౌకర్యం కూడా ఉంటుందని చెప్పారు.