ప్రముఖ కార్ల తయారీ సంస్థలు వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించేందుకు వివిధ మార్గాలు, పరీక్షలు అనుసరిస్తాయి. కొన్ని కంపెనీలు ప్రత్యేకతను చాటుకునేందుకు వారి ఉత్పత్తుల్లో కొత్త ఫీచర్లు, బిల్డ్ క్వాలిటీ.. వంటివి పరిచయం చేస్తాయి. అందులో భాగంగా బెంట్లీ కార్లపై పెయింట్ వేసినా అది కారుకు అతుక్కోకుండా తయారుచేస్తున్నారు. దాన్ని వినియోగదారులకు అందించేముందు కంపెనీ పరీక్షలు నిర్వహిస్తుంది. అయితే అందుకు సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారుతోంది.
ఈ వీడియోలో.. బెంట్లీ కారుకు పెయింట్ వేశారు. అది కారుపై అతికేలా మంటతో వేడి చేశారు. తర్వాత ఆ పెయింట్‌ను చిన్నక్లాత్‌తో శుభ్రం చేసేందుకు ప్రయత్నిస్తే కారుకు ఏమాత్రం అంటకుండా వెంటనే మొత్తం శుభ్రం అయింది. ఈ వ్యవహారాన్ని ఆ సంస్థ జీఎం టీజీ సమౌరి చూసి ఆశ్చర్యపోతున్నట్లు వీడియోలో ఉంది.
Bentley staff spray paint and flame one of their cars to show how their paint protection product works pic.twitter.com/BYRIITFpEM
— Historic Vids (@historyinmemes) March 13, 2024
Comments
Please login to add a commentAdd a comment