వాహన కొనుగోలు దారులకు అలెర్ట్. ఇప్పటికే కింద పేర్కొన్న కార్లు కొనుగోలు చేసినా, లేదంటే కొనుగోలు చేయాలని అనుకున్నా తస్మాత్ జాగ్రత్త! ఎందుకంటే?
దేశంలో దొంగలు రూటు మార్చారు. నిన్న మొన్నటి వరకు చోరీకి వెళ్లి చేతికి ఏది దొరికి అది దొంగిలించేవారు. కానీ ఇప్పుడు సెలక్ట్ చేసుకొని మరి దొంగతనం చేస్తున్నట్లు తేలింది. ముఖ్యంగా బ్రాండెడ్ కార్లపై వాళ్ల మనసు పడిందా అంతే సంగతులు.
ఇన్సూరెన్స్ కంపెనీ ఎకో (acko) నివేదిక ప్రకారం, దేశవ్యాప్తంగా 56 శాతం కంటే ఎక్కువ వాహనాలు ఢిల్లీ- ఎన్‌సీఆర్‌లలో చోరీకి గురైనట్లు తేలింది. ఈ ప్రాంతం దేశంలో కార్ల యజమానులకు హాని కలిగించే ప్రాంతంగా మారినట్లు నివేదిక పేర్కొంది. ఎకో వెహికల్ థెఫ్ట్ రిపోర్ట్ ప్రకారం, మారుతి సుజుకి వ్యాగన్ ఆర్, మారుతి సుజుకి స్విఫ్ట్ దేశంలో అత్యధికంగా దొంగిలించబడిన కార్లు జాబితాలో స్థానం సంపాదించగా.. హీరో స్ల్పెండర్ బైక్‌లను దొంగలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
అత్యధికంగా దొంగిలించబడిన టాప్ - 5 కార్లలో
మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ / మారుతి సుజుకి స్విఫ్ట్
హ్యుందాయ్ క్రెటా
హ్యుందాయ్ శాంత్రో
హోండా సిటీ
హ్యుందాయ్ ఐ10
అత్యధికంగా దొంగతనానికి గురైన టాప్ -5 టూ వీలర్లు
హీరో స్ప్లెండర్
హోండా యాక్టివా
బజాజ్ పల్సర్
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350
టీవీఎస్ అపాచీ
దేశంలో సురక్షితమైన ప్రాంతాలు
భారతదేశంలో దొంగతనాలు ఎక్కువగా జరిగే నగరాల గురించి ఈ ఎకో నివేదిక హైలెట్ చేసింది. దేశంలో వాహన దొంగతనాల విషయానికి వస్తే, వాహన దొంగతనాల కేసుల్లో ఢిల్లీ-ఎన్‌సీఆర్ తర్వాత బెంగళూరు 9 శాతం, చెన్నై 5 శాతం ఉన్నాయి. కాగా, దేశంలోనే అతి తక్కువ వాహనాల దొంగతనాలు జరుగుతున్న నగరాలుగా హైదరాబాద్, ముంబై, కోల్‌కతా నిలిచాయి.
అత్యంత ఇష్టపడే కారు రంగు
కారు రంగు విషయానికి వస్తే తెల్లటి కార్లు ఎక్కువగా దొంగతనానికి గురవుతాయి. తెల్ల కార్లను దొంగతనం చేయడానికి కారణం..ట్రాఫిక్‌లో గుర్తించ లేకపోవడం, తెల్లటి కార్ల రంగును మార్చడం చాలా సులభం.
చదవండి👉 'టెన్షన్ వద్దు..నేను ఏదో ఒకటి చేస్తాలే' ఆనంద్ మహీంద్రా రీ ట్వీట్ వైరల్!
Comments
Please login to add a commentAdd a comment