న్యూఢిల్లీ: సెమికండక్టర్ల కొరత వాహన పరిశ్రమకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వెల్లువలా ఆర్డర్లు ఉన్నప్పటికీ వాహనాలను తయారు చేయలేని పరిస్థితి ఉంది. ప్యాసింజర్ వెహికిల్స్ ఒక్కటే 6.5 లక్షల యూనిట్లకు ఆర్డర్లు ఉన్నాయి. చిప్ సరఫరా మెరుగుపడితేనే ఇవి రోడ్డెక్కేది. దీంతో తాము బుక్ చేసుకున్న కారు కోసం నెలల తరబడి కస్టమర్లు వేచిచూడక తప్పడం లేదు.
ఒక్క మారుతి సుజుకీ 3.4 లక్షల యూనిట్లకుపైగా పెండింగ్ ఆర్డర్లు ఉన్నాయి. హ్యుండై, మహీంద్రా కలిపి దాదాపు 3 లక్షల యూనిట్లు ఉంటుంది. ప్యాసింజర్ కార్ల మార్కెట్లో మొత్తం పెండింగ్ ఆర్డర్లు సుమారు 6.5 లక్షల యూనిట్లు ఉంటుందని మారుతి సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఈడీ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. మోడల్, వేరియంట్‌నుబట్టి వెయిటింగ్ పీరియడ్ 4–12 వారాలు ఉందని టాటా మోటార్స్ ప్రతినిధి వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో ఇది 6 నెలల వరకు ఉందన్నారు. చిప్ సరఫరా సరిగా లేక ఏడాదిగా డెలివరీలు తీవ్ర ఆలస్యం అవుతున్నాయని హోండా కార్స్ ఇండియా ప్రతినిధి వివరించారు. వేచి ఉండే కాలం మోడల్‌నుబట్టి 2–9 నెలలు ఉందన్నారు.
చదవండి: Elss Scheme: అదీ సంగతి.. ఈ స్కీమ్‌లో ఏ విభాగమైనా, పీపీఎఫ్ కంటే రెట్టింపు రాబడులు!
Comments
Please login to add a commentAdd a comment