Honda Car Under 5 Lakhs Best Features In India - Sakshi
Sakshi News home page

Honda Cars: బడ్జెట్‌ ధరలో హోండా సిటీ కారు

Published Sun, Dec 25 2022 10:33 AM | Last Updated on Sun, Dec 25 2022 12:00 PM

Hero Honda Car Under 5 Lakhs Best Features In India - Sakshi

భారత ఆటోమొబైల్‌ రంగంలో ప్రముఖ కార్ల కంపెనీ ‘హోండా సిటీ’ గురించి ప్రత్యేకంగా చెప్ప​క్కర్లేదు. కస్టమర్లలో ఈ కంపెనీ కార్లకు ప్రత్యేమైన ఫ్యాన్‌ బేస్‌ కూడా ఉంది అందులోనూ ముఖ్యంగా హోండా సిటీ సెడాన్ కార్లకు. అయితే ఇటీవల ఈ కారు కాస్త ఖరీదుగా మారిందనే చెప్పాలి.

అయితే హోండా లవర్స్‌ కోసం తక్కువ ధరలో మంచి ఇంజన్ కండీషన్‌తో హోండా సిటీ సెకండ్ హ్యాండ్ కార్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు, విక్రయించేందుకు ఉన్న ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం Cars24 (కార్స్‌ 24) లో పలు కార్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాట్‌ఫాంలో ఉన్నసెకండ్ హ్యాండ్ హోండా సిటీ కార్ల జాబితా ఓ లుక్కేద్దాం.

హోండా సిటీ S MT( Honda City S MT):
2013 హోండా సిటీ S MT మోడల్ హోండా సిటీ. దీని ధర రూ. 5,33,000. ఈ కారు ఇప్పటివరకు 45వేల కి.మీ ప్రయాణించింది. ఇది పెట్రోల్ ఇంజన్‌తో పాటు సీఎన్‌జీ పై కూడా నడుస్తుంది. నోయిడాలో ఈ కారు విక్రయానికి అందుబాటులో ఉంది.

హోండా సిటీ SV MT(Honda City SV MT):
2014 హోండా సిటీ SV MT మోడల్ కారు. దీని ధర రూ.5,48,000. ఈ కారు రీడింగ్ 60,214 కి.మీ. ఇది పెట్రోల్ ఇంజన్‌తో నడుస్తుంది. ఇది నోయిడాలో అమ్మకానికి అందుబాటులో ఉంది.

హోండా సిటీ V MT(Honda City V MT):
2015 హోండా సిటీ V MT కారు. ధర రూ.6,23,000. ఇది పెట్రోల్ ఇంజన్‌తో నడుస్తుంది. ఈ కారుకు రెండవ యజమాని ఉపయోగిస్తున్నారు. ఇది నోయిడాలో అమ్మకానికి అందుబాటులో ఉంది.

హోండా సిటీ VX CVT (Honda City VX CVT):
2014 హోండా సిటీ వీఎక్స్ సీవీటి మోడల్‌ కారు. దీని ధర రూ.6,71,000. రీడింగ్ 82,622 కి.మీ. ఇది పెట్రోల్ ఇంజన్‌తో నడుస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement